Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను అంత చీప్ చూస్తున్న ఆప్!

By:  Tupaki Desk   |   21 April 2019 9:02 AM GMT
కాంగ్రెస్ ను అంత చీప్ చూస్తున్న ఆప్!
X
మొత్తానికి కాంగ్రెస్ - ఆమ్ ఆద్మీ పార్టీల పొత్తు కుదిరే పని కాదని తేలిపోతోంది. వీళ్ల పొత్తుకు సంబంధించిన చర్చలు సోషల్ మీడియా వేదికగానే జరిగాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీల వారూ పరస్పరం కించపరుచుకోవడానికి కూడా వీరు వెనుకాడటం లేదు.

కాంగ్రెస్ పార్టీతో పంజాబ్ - హర్యానా - ఢిల్లీల్లో పొత్తు పెట్టుకోవాలని ఆప్ భావించింది. అయితే ఆప్ తో పొత్తుకు హర్యానా - పంజాబ్ కాంగ్రెస్ నేతలు ససేమేరా అన్నారు. చివరకు ఢిల్లీ వరకూ ఆప్ తో పొత్తుకు కాంగ్రెస్ నేతలు ఓకే అన్నారు. అయితే పంబాజ్ - హర్యానాల్లో కుదరని పొత్తు ఢిల్లీలో మాత్రం ఎందుకని అనుకుందో ఏమో కానీ.. ఆప్ ఢిల్లీలో పొత్తుకు నో అన్నట్టుగా వ్యవహరించింది.

దీంతో ఇరు పార్టీల మధ్యన పొత్తు కుదరనట్టే అని తేటతెల్లం అయిపోయింది. ఢిల్లీలో ఉన్న ఏడు ఎంపీ సీట్లలో మూడు ఎంపీ సీట్లను కోరిందట కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ మాత్రం దానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ రేంజ్ కు మూడు ఎంపీ సీట్లు ఇవ్వడం కూడా వేస్టే అని ఆప్ అంటోంది.

అంతటితో కూడా ఆగలేదు. 'మూడు సీట్లను కాంగ్రెస్ కు ఇచ్చే బదులు.. బీజేపీకే ఇవ్వడం మేలు..' అని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. ఇక కాంగ్రెస్ కూడా తాము రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నట్టుగా తెలిపింది.