Begin typing your search above and press return to search.
మోడీ డిగ్రీలుగా చూపిస్తున్నవి నకిలీనా?
By: Tupaki Desk | 10 May 2016 8:09 AM GMTప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హత మీద చర్చ రేపి.. చివరకు బీజేపీ చేతనే ప్రధాని పట్టాలను బయట పెట్టేలా చేయించటంలో ఆమ్ ఆద్మీ విజయం సాధించిందని చెప్పాలి. గత కొద్దిరోజులుగా మోడీ విద్యార్హతల మీద ఆమ్ ఆద్మీ పార్టీ చర్చ పెట్టటం.. పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీలు స్వయంగా మోడీకి సంబంధించి డిగ్రీ.. పీజీ పట్టాలు విడుదల చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మోడీ (నరేంద్ర దామోదర్ దాస్ మోదీ) ప్రస్తావనే లేదంటూ కేజ్రీవాల్ ఆరోపించిన నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం ప్రచారంతో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించి బీజేపీ అధినాయకత్వం నిద్ర లేచింది.
మోడీకి చెందిన డిగ్రీ పట్టాల కాపీల్ని బయటకు విడుదల చేసింది. ప్రధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ వర్సిటీలో మోడీ పేరు లేదని కేజ్రీవాల్ చెబుతునారని.. బీఏ పరీక్షలు రాసేందుకు మోడీ ఢిల్లీకి వచ్చే వారని జైట్లీ వివరించటమే కాదు.. తాను అప్పట్లో ఢిలీ వర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నట్లుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని డిగ్రీల మీద ఆమ్ ఆద్మీ ఎదురుదాడి షురూ చేసింది. మోడీకి చెందిన డిగ్రీలంటూ బీజేపీ నేతలు విడుదల చేసిన పత్రాలు నకిలీలుగా అభివర్ణించింది. తనవాదనలో భాగంగా కొన్ని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఆమ్ ఆద్మీ నేతల వాదనల్లో ప్రధానమైనది.. కీలకమైన అంశం.. మోడీ పేరు బీఏ మార్కుల జాబితాలో ఒకలా.. ఏంఏ డిగ్రీలో మరోలా ఉండటం ఇప్పుడు వివాదంగా మారింది. పాస్ అయిన సంవత్సరాల విషయంలోనూ తేడాలున్నట్లుగా ఆమ్ ఆద్మీ నేతలు చెబుతున్నారు. బీఏ మార్కుల జాబితా మీద 1978 అని ఉంటే.. డిగ్రీ పట్టా మీద 1979 అని ఉండటాన్ని ప్రశ్నిస్తుంది.
అదే సమయంలో మోడీ పేరులోనూ కొన్ని తప్పుల్ని ఆమ్ ఆద్మీ నేతలు ఎత్తి చూపుతున్నారు. బీఏ మార్కుల జాబితాలో ‘‘నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోడీ’’ అని ఉంటే ఏంఏ పట్టాల్లో మాత్రం ‘‘నరేంద్ర దామోదర్ దాస్ మోడీ’’ అని ఉందని చెబుతోంది. డిగ్రీలో ఉన్న కుమార్.. ఏంఏ పట్టాలో మాత్రం లేదని చెబుతోంది. అయితే.. ఈ తప్పులన్నీ క్లరికల్ తప్పులుగా బీజేపీ అభివర్ణిస్తోంది. ఏమైనా.. ఈ ఉదంతం పలు సందేహాలు వ్యక్తమయ్యేలా చేయటమే కాదు.. క్లరికల్ తప్పులంటే ఏదో ఒకటి ఉండొచ్చు కానీ.. మరీ ఇన్ని తప్పులా? అంటూ రాగాలు తీస్తున్న వారూ లేకపోలేదు. డిగ్రీ పట్టాల విడుదలతో వివాదం సమిసిపోవటం కాకుండా.. మరింత పెరిగి పెద్దది కావటం గమనార్హం.