Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యేకు పవన్, జనసేన తెలియదట
By: Tupaki Desk | 1 Aug 2016 1:54 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెపితే రెండు తెలుగు రాష్ర్టాల్లో తెలియని వారుండరు. ఇక సినీ ప్రియులైతే పవన్ సినిమా కోసం ఎలా పడిచస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ కు పదేళ్లుగా హిట్ లేకపోయినా ఆయన సినిమాలకు టిక్కెట్లు దొరకవంటే రెండు తెలుగు రాష్ర్టాల్లో పవన్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఇక సౌత్ లో కూడా పవన్ కు అన్ని భాషల్లోను కాస్తో కూస్తో గుర్తింపు ఉంది. పవన్ నటించిన పలు సినిమాలు బాలీవుడ్ లోకి సైతం డబ్ అయ్యాయి.
పవన్ గత ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీని సైతం కలిసివచ్చారు. గత ఎన్నికల్లో పవన్ మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు - బీజేపీ మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో పవన్ ప్రసంగాలకు వచ్చిన క్రేజ్ చూసి మోడీ సైతం షాక్ అయ్యారు. ఎన్నికల తర్వాత టీడీపీకి-బీజేపీకి హోదా విషయంలో వస్తున్న గ్యాప్ దృష్ట్యా వచ్చే 2019 ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. అది పవన్ - జనసేన మానియా అంటే.
అలాంటి పవన్ - జనసేన గురించి ఆమ్ ఆద్మీ పార్టీలో ఓ కీలక వ్యక్తికి తెలియదట. పైగా ఆయన ఆప్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. పోనీ అక్కడితే అనుకుంటే సరిపోదు. సదరు నేత ఆప్ సౌత్ ఇండియా వ్యవహారాల ఇన్ చార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాంటి నేతకు పవన్ - జనసేన గురించి తెలియకపోవడం ఆశ్చర్యకరమే. ఆప్ ఎమ్మెల్యే - ఆ పార్టీ సౌత్ ఇండియా వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఉన్న సోమనాథ్ భారతి సోమవారం తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు.
తిరుపతి విలేకర్లు సోమనాథ్ ను 2019లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో ఆప్ పొత్తు ఉంటుందా అని ప్రశ్నించారు. దీంతో ఆయన ఇచ్చిన ప్రశ్నతో తిరుపతి విలేకర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు అలాంటి పార్టీ ఒకటి ఉన్నట్టు తనకు తెలియదని ఆయన తెలిపారు. ఈ ప్రశ్నకు ఆయన ఒక్కసారిగా అమాయక మొఖం పెట్టడం విశేషం. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరూ గట్టిగా పోరాటం చేయాలన్న ఆయన 2019లో ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం గమనార్హం.