Begin typing your search above and press return to search.
సమోసా.. టీ కోసం కోటి ఖర్చు పెట్టేశారు
By: Tupaki Desk | 6 Sep 2016 5:22 AM GMTఆదర్శాలు వల్లించటం వేరు. వాటిని ఫాలో కావటం వేరు. మాటలకు చేతలకు మధ్యనున్నఅంతరం ఎంత ఎక్కువన్న విషయం ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రజాధనానికి పరిరక్షకులుగా ఉంటామని.. సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా వ్యవహరిస్తామని చెప్పే మాటలు చేతల్లో ఎలా ఉంటాయన్న విషయాన్ని ఢిల్లీ అధికారపక్షం చేతల్లో చేసి చూపిస్తున్న వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దుబారాలో ఆమ్ ఆద్మీ సర్కారు మిగిలిన ప్రభుత్వాలకు ఏమీ తీసిపోవటం లేదన్న విషయం తాజాగా బయటకు వచ్చిన ఒక లెక్కను చూస్తే అర్థమయ్యే పరిస్థితి. రికార్డు మెజార్టీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ సర్కారు గడిచిన ఏడాదిన్నర కాలంలో సమోసా.. టీల కోసం పెట్టిన ఖర్చు ఏకంగా కోటి రూపాయిలు దాటటం గమనార్హం. తమను కలిసేందుకు వచ్చిన వారికి ఛాయ్.. బిస్కెట్లు.. సమోసాల్లాంటి స్నాక్స్ పెట్టటానికి ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్లుగా లెక్కలు చెబుతున్నారు.
స్నాక్స్ ఖర్చులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖర్చు భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆయన ఒక్కరి ఖర్చే రూ.47 లక్షలు ఉన్నట్లు తేలింది. ఇయన.. ఆయన సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మనీశ్ సిసోడియా రూ.17లక్షలు ఖర్చు చేసినట్లుగా లెక్కలు తేలాయి. వీరిద్దరితో పాటు.. కేజ్రీ క్యాబినెట్ లోని మంత్రులంతా కలిసి దాదాపు రూ.36 లక్షలు ఖర్చుచేసినట్లుగా లెక్కలు బయటకు వచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు. టీ.. సమోసాలకే కోట్ల ఖర్చేందన్న విస్మయం వ్యక్తమవుతుంది. పేరుకు మాత్రమే సామాన్యుడి సర్కారే కానీ.. ఖర్చులో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.