Begin typing your search above and press return to search.

ఢిల్లీ కార్పొరేష‌న్‌లో క‌మ‌లాన్ని ఊడ్చి పారేసిన ఆప్‌!

By:  Tupaki Desk   |   7 Dec 2022 11:52 AM GMT
ఢిల్లీ కార్పొరేష‌న్‌లో క‌మ‌లాన్ని ఊడ్చి పారేసిన ఆప్‌!
X
ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో చీపురుక‌ట్ట దెబ్బ‌కు క‌మ‌ల‌నాథు క‌కావిక‌ల‌మ‌య్యారు. 15 సంవ‌త్స‌రాల బీజేపీ ఆధిప‌త్యానికి ఆప్ శుభంకార్డు ప‌లికింది. ఢిల్లీ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆప్ అభ్య‌ర్థులు విజ‌య‌దుంధుభి మోగించారు. మొత్తం 250 కార్పొరేట‌ర్లున్న ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 135 స్థానాల‌ను గెలుచుకుని న‌గ‌ర మేయ‌ర్ పీఠం కైవ‌సం చేసుకుంది. ఈ ఫ‌లితాల‌తో ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రాభ‌వానికి ముగింపు ప‌లికిన‌ట్లైంది.

ఇటీవ‌లే పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుని ఆ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారి అధికార‌పీఠాన్ని కైవ‌సం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు బీజేపీ నేత‌ల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దేశంలో చాలా వేగంగా ఆమ్ ఆద్మీ పార్టీ వేళ్లూనుకుపోవ‌డానికి ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజీ్ర‌వాల్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ఇలా ఉండ‌గా తాజాగా జ‌రిగిన ఢిల్లీ మున్సిల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షించాయి. మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో గ‌త 15 సంవ‌త్స‌రాలుగా కొలువుదీని బీజేపీ ఆధిప‌త్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ అడ్డుక‌ట్ట వేస్తుందా లేక క‌మ‌ల‌నాథుల‌దే మ‌ళ్లీ పైచేయి అవుతుందా అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో DMC ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆమ్ ఆద్మీపార్టీ క‌మ‌ల‌నాథుల‌కు గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ కేవ‌లం 101 స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. ఆ పార్టీ కేవ‌లాం 9 స్థానాల్లో మాత్ర‌మే గెలివ‌గ‌లిగింది. చాలా చోట్ల కాంగ్రెస్ నామమాత్ర‌పు పోటీ మాత్ర‌మే ఇచ్చింది.

2017లో అప్పటి 270 మునిసిపల్ వార్డుల్లో 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, ఆప్ 48 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి.

ఈ విజ‌యంతో దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రపాల‌క సంస్థ‌లో తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ మేయ‌ర్ పీఠాన్ని అలంక‌రించ‌బోతోంది. ఈ ఘ‌న విజ‌యం అందించిన ఢిల్లీ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.