Begin typing your search above and press return to search.
AARA పొలిటికల్ సర్వే ఒక బోగస్ నా!?
By: Tupaki Desk | 14 July 2022 12:30 PM GMTఇటీవల కాలంలో పొలిటికల్ సర్వేలు పెరిగిపోతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న సంస్థలు.. అదిగో పులి.. అంటూ.. ఇదిగో తోక అంటూ.. సర్వేలను వండి వారుస్తున్నాయి. దీంతో ఏది నమ్మాలో ఏది నమ్మ కూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా AARA మస్తాన్ ఇచ్చిన రిపోర్టు పెద్ద బోగస్ అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన విశ్వసనీయత(క్రెడిబిలిటీ) గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 120 సీట్ల పైన గెలుందని చెప్పారు. కానీ, అప్పటి ఎన్నికల్లో ఈ పార్టీ చిత్తుగా ఓడిపోయి కేవలం 67 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఇక, 2019 ఎన్నికలకు వచ్చే సరికి వైఎస్సార్ సీపీ ఆయనపై విశ్వాసం లేకో.. మరేమో.. తెలియదు కానీ.. ఆయనకు సర్వే అవకాశం ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో ఒంగోలులో సర్వే చేసి.. బాలినేని 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోతాడు అని చెప్పారట. అయితే.. ఆయన ఇదే మెజారిటీతో అక్కడ విజయం దక్కించుకున్నారు.
ఇటీవల తెలంగాణలోని దుబ్బాకలో జరిగిన బై పోల్‌లో అధికార పార్టీ టీఆర్ ఎస్ 20 వేల ఓట్ల తేడాతో గెలుస్తుందని AARA సర్వే తేల్చిచెప్పంది. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయింది. బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ పార్టీ తరఫున పోటీ చేసిన.. రఘునందనరావు విజయం దక్కించుకున్నారు. ఇక, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి గెలుస్తారని.. ఆయన పుంజుకుంటున్నారని AARA చెప్పింది. కానీ, అక్కడ కూడా సీన్ రివర్స్ అయింది.. టీఆర్ ఎస్ విజయం దక్కించుకుంది.
ఇక, హుజూరాబాద్‌లో వచ్చిన ఉప పోరులో టీఆర్ ఎస్ 25వేల ఓట్ల తేడాతో విజయం దక్కించుకుంటుం దని AARA జోస్యం చెప్పారు. కానీ, అక్కడ ఈటల రాజేందర్ విజయం దక్కించుకుని.. బీజేపీని గెలుపు గుర్రం ఎక్కించారు. అయితే.. AARA వాదన ఏంటంటే.. 2018 ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందని.. చెప్పారని చెప్పుకొంటున్నారు. కానీ, అప్పుడుఉన్న టీఆర్ ఎస్ మీద పాజిటివ్ టాక్.. ఉంది. ఎవరైనా.. చెప్పారు అని మాట్లాడుతున్నారు. అంటే.. టీఆర్ ఎస్ గెలుస్తుందని.. అందరూ లెక్కలు వేసుకున్నారు.
అతనికి బీజేపీ వాళ్లతో టై అప్ (ఒప్పందం) అయి.. ఇలా సర్వేలు ఇస్తున్నాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆయన ఇచ్చిన రిపోర్టుల ప్రకారం నవంబరు 2021 నుంచి అని చెబుతున్నారు. అసలే.. రోజు రోజు.. పొలిటికల్ సీన్ మారిపోతోంది. ఇలా బీజేపీ 2వ ప్లేస్‌లో ఉండి.. ఎలా ఇస్తారు? ఇప్పుడు బీజేపికి సెకండ్ ప్లేస్ ఇచ్చి మరలా.. మూడు నెలల్లో బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని.. ఇస్తాడేమో.. అని.. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకంగా కొందరు చెప్పుకొంటున్నారు.
ఇదే విషయం కాంగ్రెస్ సోషల్ మీడియాలో అతనికి ఫుల్‌గా ఆడుకుంటున్నారని అంటున్నారు. ఇటీవల మోడీ పర్యటనలో యాక్టివ్‌గా బీజేపీకి స్టేజ్ అంతా చూశాడని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇలాంటి సర్వలను నమ్మవద్దని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది.