Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్: 16 దేశాల కెప్టెన్లు ఒకే ఫ్రేమ్ లు.. వైరల్ పిక్

By:  Tupaki Desk   |   15 Oct 2022 7:33 AM GMT
టీ20 వరల్డ్ కప్: 16 దేశాల కెప్టెన్లు ఒకే ఫ్రేమ్ లు.. వైరల్ పిక్
X
టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి క్వాలిఫైయర్స్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 23న జరుగబోతోంది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. ప్రపంచంలోని 16 దేశాల కెప్టెన్లు కలిసి సంయుక్త మీడియాసమావేశం.. ఫొటో సెలషన్ నిర్వహించారు. ఆ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

టోర్నీ ప్రారంభంకానున్న నేపథ్యంలో మొత్తం 16 టీంల ఫొటో షూట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 16 జట్ల కెప్టెన్స్ తో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫొటోను ట్యాగ్ చేస్తూ 'మోస్ట్ లవ్ డ్ సెల్ఫీ' అని ట్వీట్స్ చేస్తున్నారు.

శనివారం నిర్వహించిన 'కెప్టెన్స్ డే' కార్యక్రమంలో 16 మంది టీంల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. మెగా టోర్నీకి ఎలా సిద్ధమయ్యారో వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఐసీసీ ట్విట్టర్ లో పంచుకుంది. 'ఒకే ఫ్రేమ్ లో 16మంది కెప్టెన్లు' అంటూ రాసుకొచ్చింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సన్నద్ధత గురించి వివరించారు. దాయాది పాకిస్తాన్ తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ పై కూడా మాట్లాడారు. బౌలింగ్ విభాగం బుమ్రా, జడేజా లేక వీక్ అయ్యిందని.. కానీ దాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఉన్నారని వివరించారు. ఆ సమయంలో ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారని తెలిపారు.

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 సమరానికి ముందు తొలి రౌండ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆదివారం నుంచి రౌండ్ మ్యాచ్ లు ఉంటాయి. సూపర్ 12లో ఖాళీగా ఉన్న 4 స్థానాలను దక్కించుకోవడం కోసం 8 జట్లు పోటీపడుతాయి.

ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘనిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు నేరుగా సూపర్ 12కు అర్హత సాధించాయి.

ఇక గ్రూప్ ఏలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక , యూఏఈలు పోటీపడుతాయి. ఇందులో గెలిచిన రెండు జట్లు సూపర్ 12కు అర్హత పొందుతాయి.

ఇక గ్రూప్ బీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడుతాయి. ఇందులో గెలిచిన 2 జట్లు సూపర్ 12కు వెళతాయి.

ఓవరాల్ గా చూస్తే పెద్ద జట్లు అయిన శ్రీలంక, వెస్డిండీస్ లకు సూపర్ 12లో ఛాన్స్ ఉంది. మిగతా జట్లు ఏం చేస్తాయన్నది వేచిచూడాలి. మరి ఈ 16 జట్లలో ఏం టీం వరల్డ్ కప్ ను అందుకుంటుందన్నది వేచిచూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.