Begin typing your search above and press return to search.

క‌రోనా సోక‌కుండా ఆయుష్ చిట్కాలు

By:  Tupaki Desk   |   16 April 2020 1:30 AM GMT
క‌రోనా సోక‌కుండా ఆయుష్ చిట్కాలు
X
ప్ర‌స్తుతం క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌జ‌ల‌కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు, ఆ వైర‌స్ సోక‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు వివ‌రిస్తున్నారు. బ్యాన‌ర్లు క‌ట్టి.. ప్ర‌సార మాధ్య‌మాలు, సోష‌ల్ మాధ్య‌మాల్లో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా క‌రోనా వైర‌స్‌ పై అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది. ఈ సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్ సోక‌కుండా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి అధికంగా ఉండాలి. ఆ శ‌క్తి అధికంగా ఉంటే క‌రోనా అస‌లే రాదు. ఒక‌వేళ సోకినా వెంట‌నే కోలుకునేందుకు అవ‌కాశం ఉంది. మ‌న రోగ నిరోధ‌క శ‌క్తే మ‌న శ‌రీరానికి ర‌క్ష‌. అలాంటి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చిట్కాల‌ను వెల్ల‌డించింది. ఆయుష్ తెలిపిన ప్ర‌కారం..

- వంట‌కాల్లో ప‌సుపు - జీల‌క‌ర్ర‌ - ధ‌నియాలు - వెల్లుల్లి త‌ప్ప‌కుండా ఉండాలి.
- 150 మిల్లీ లీట‌ర్ల పాల‌లో స‌గం చెంచా ప‌సుపు క‌లుపుకుని రోజుకు రెండుసార్లు తాగాలి.
- దాహం వేస్తే గోరువెచ్చ‌ని నీరు తాగాలి.
- తుల‌సీ - దాల్చిన చెక్క‌ - న‌ల్ల మిరియాలు - శొంఠి - ఎండుద్రాక్ష మొద‌లైన వాటితో చేసి డికాష్ రోజు రెండుసార్లు తాగాలి.
- ఉద‌యం - సాయంత్రం నువ్వుల‌నూనె - కొబ్బ‌రినూనె - నెయ్యిని ముక్కుల్లో వేసుకోవాలి.
- రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయాలి. త‌ర్వాత నోటిని గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- పొడి ద‌గ్గు ఉంటే పుదీనా ఆకులు - సోంపు గింజ‌ల‌ను క‌లిపిన నీటితో ఆవిరి ప‌ట్టాలి.
- సాధార‌ణ ద‌గ్గు - గొంతునొప్పి ఉంటే ల‌వంగాల పొడిని బెల్లంతో లేదా తేనేతో క‌లుపుకుని రోజుకు రెండుమూడుసార్లు తీసుకోవాలి.
- రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు యోగా - ప్రాణాయామం - ధాన్యం చేయాలి.

వీటితో పాటు య‌థావిధిగా ఇంట్లో ప‌రిశుభ్ర‌త‌.. శ‌రీరంలో పరిశుభ్ర‌త పాటించాల‌ని చెబుతున్నారు. ప‌రిశుభ్ర‌త శ్రీరామ‌ర‌క్ష అని - అది ఏ వ్యాధుల‌ను ద‌రి చేర‌నీయ‌వ‌ని పేర్కొంటున్నారు.