Begin typing your search above and press return to search.
వెనకడుగుల పర్వంలో మరో అడుగు వెనక్కి వేసిన కేసీఆర్
By: Tupaki Desk | 31 Dec 2020 10:31 AM GMTకాలం కలిసి రానప్పుడు టెంకాయి సైతం టైంబాంబ్ మాదిరి పేలుతుందన్న నానుడికి తగ్గట్లు.. తనకు ప్రతికూల వాతావరణం అంతకంతకూ పెరుగుతున్న వేళలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు ఒకటి తర్వాత ఒకటిగా తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో కొత్త విధానమే తప్పించి పాత విధానాన్ని మర్చిపోవాలని కరాఖండిగా చెప్పిన గులాబీ బాస్.. ఇటీవల ఆ విషయంలో వెనక్కి తగ్గి పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లకు ఓకే చెప్పటం తెలిసిందే.
అనంతరం ఎల్ఆర్ఎస్ విషయంలోనూ అలానే వెనక్కి తగ్గారు. ప్రభుత్వం చెప్పిన పంటలు మాత్రమే రైతులు పండించాలని.. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. ఆర్భాటంగా ప్రకటనలు చేసిన సీఎంకేసీఆర్ వెనక్కి తగ్గారు. అంతేకాదు.. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డిమాండ్లపైనా సానుకూలంగా స్పందించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా వడివడిగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. తాజాగా మరో వెనకడుగు వేయటం ఆసక్తికరంగా మారింది.
కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పథకం అద్భుతమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.. తాజాగా మాత్రం అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ స్థానంలో కేంద్రం అమల్లోకి తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించటం ఆసక్తికరంగా మారింది.
అన్ని రాష్ట్రాల ప్రధానకార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోమేశ్ మాట్లాడుతూ.. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తమ ప్రభుత్వ పథకమైన ఆరోగ్య శ్రీలో జేరుస్తామని.. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తాము తీసుకున్నట్లుగా వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా కేంద్రంతో కలిసి పోవటానికి.. రాష్ట్రంలో వివాదంగా ఉన్న అంశాల్ని.. ప్రజలు వ్యతిరేకిస్తున్న అంశాల్ని సరిదిద్దటంతో పాటు.. నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ మార్పులు చోటు చేసుకోవటం గమనార్హం. మొత్తంగా ప్రతి విషయంలోనూ వెనకడుగు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో ఇదొకటి కావటం గమనార్హం.