Begin typing your search above and press return to search.

ఏబీడీ వీర విహారం.. 'ఆరేసిన ' బెంగళూరు

By:  Tupaki Desk   |   18 Oct 2020 3:32 AM GMT
ఏబీడీ వీర విహారం.. ఆరేసిన  బెంగళూరు
X
ఏబీ డివిలియర్స్ మరోసారి విధ్వంసక బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్ బలైపోయింది. డివిలియర్స్ ఫోర్ల కన్నా సిక్సర్లే సులువంటూ మరో సారి బాదేశాడు. ఈ మ్యాచ్ లో ఫోర్ల కన్నా సిక్సులు ఎక్కువగా నమోదయ్యాయంటే అందుకు ఏబీ నే కారణం. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీతో రాణించాడు. రాబిన్ ఊతప్ప (22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) 41 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. స్మిత్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ )తో 57 అర్ధ సెంచరీతో మెరిశాడు.

బెన్ స్టోక్స్ (15 ), పరుగులు మాత్రమే చేసి సంజూ శాంసన్ (9)నిరాశపరిచారు. జోస్ బట్లర్ (24), రాహుల్ తెవాటియా (19 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోరిస్ కు 4 వికెట్లు, యజువేంద్ర చహల్ 2 వికెట్లు పడగొట్టాడు.

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఆరంభంలోనే ఆరోన్‌ ఫించ్‌(14; 11 బంతుల్లో 2x6) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (35), కోహ్లీ (43) రాణించారు.

వీరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. జట్టు స్కోర్‌ 102 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఔటయ్యారు. 13వ ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌ తెవాతియా బౌలింగ్‌లో దేవ్‌దత్‌ ఔటవ్వగా, తర్వాతి ఓవర్‌ తొలి బంతికి కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో కోహ్లీ వెనుతిరిగాడు. ఆ తర్వాత డివిలియర్స్‌, గుర్‌కీరత్‌ సింగ్‌(19; 17 బంతుల్లో 1x4) మ్యాచ్ ని నడిపించాడు.

డివిలియర్స్‌(55; 22 బంతుల్లో, 1x4, 6x6) విధ్వంసకరంగా బ్యాటింగ్‌
చేశాడు. చివర్లో చేయాల్సిన పరుగులు పెరగడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. 19 ఓవర్ లో ఉనాద్కత్ బౌలింగ్ చేయగా ఆ ఓవర్లో ఏబీ మూడు సిక్సర్లు బాదడంతో మ్యాచ్ బెంగళూరు వైపు టర్న్ అయ్యింది. చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయాన్ని అందుకుంది.

మోరిస్ కు నాలుగు వికెట్లు

బెంగళూరు జట్టుకు డివిలియర్స్ బ్యాటింగ్ లో అండగా నిలిస్తే క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ భారీ పరుగులు చేయకుండా అడ్డుకట్ట వేశాడు. చాహల్ రెండు వికెట్లు తీశాడు.

మలుపు తిప్పిన 19వ ఓవర్

డివిలియర్స్ మ్యాచ్ భారాన్ని భుజాలపై వేసుకున్నా చివర్లో రన్ రేట్ పూర్తిగా పెరిగిపోయింది. 19 ఓవర్లో ఉనాద్కత్ బౌలింగ్ లో డివిలియర్స్ వరుసగా మూడు సిక్సర్లు బాదేసి మ్యాచ్ ని బెంగళూరు వైపు తిప్పేసాడు.