Begin typing your search above and press return to search.
ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ శాఖాపరమైన విచారణ మీడియాకు అనుమతిలేనట్టే?
By: Tupaki Desk | 15 March 2021 1:30 PM GMTఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన విచారణకు సర్వం సిద్ధమైంది. ఆయనపై నమోదైన అభియోగాలను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆధ్వర్యంలో ఈ నెల 18న సచివాలయంలో విచారణ జరపనున్నారు. ఈ విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని, నివేదికను మే 3న కోర్టుకు సమర్పించాలని సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై విచారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న మాజీ డీజీలు రాముడు, మాలకొండయ్య, సాంబశివరావు, ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. వీరందరూ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే మెమోలు అందాయి.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమించారని, భద్రతాపరమైన వస్తువుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సర్కారు ఏడాది క్రితం ఆయనను సస్పెండ్ చేసింది. అయితే.. తనపై సస్పెన్షన్ ఎత్తేయాలని, పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు ఏబీ వెంకటేశ్వరరావు. విచారించిన న్యాయస్థానం పై విధంగా తీర్పు చెప్పింది.అయితే.. సచివాలయంలో తనపై జరగనున్న న్యాయ విచారణ.. ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో జరిగేలా చూడాలని ఆయన కోర్టును కోరారు. కానీ.. ఈ శాఖాపరమైన విచారణ సాధారణంగానే గోప్యంగా జరుగుతుందని తెలిసింది.