Begin typing your search above and press return to search.

క్యాట్ కు వెళ్లి కన్నీళ్లు పెట్టుకునే స్థితికి ఏబీ వెంకటేశ్వరరావు

By:  Tupaki Desk   |   25 Feb 2020 9:55 AM GMT
క్యాట్ కు వెళ్లి కన్నీళ్లు పెట్టుకునే స్థితికి ఏబీ వెంకటేశ్వరరావు
X
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అతడి సస్పెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నో అవినీతి ఆరోపణలు, అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే తన సస్పెన్షన్ విషయమై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో పిటిషన్ వేశారు. ప్రస్తుతం క్యాట్ లో అతడి సస్పెన్షన్ విషయమై విచారణ సాగుతోంది. క్యాట్ తో తనకు సానుకూల నిర్ణయం వస్తుందని అనుకుంటుండగా ఆయన మరింత చిక్కుల్లో పడేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

క్యాట్ లో విచారణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వర రావు అధికారుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణలో ఆయన పలు విషయాలు వెల్లడిస్తున్నాడు. ఆ విషయాలన్నీ ఆయనను ఇరుకులన పెట్టేలా ఉన్నాయి. ప్రభుత్వం చేసిన ఆరోపణలను మరింతగా ప్రస్ఫుటం చేసేలా ఉన్నాయని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సమయంలో కూడా ఆయన టీడీపీకి అనుకూలంగా ఉన్నారంటూ వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కూడా. జగన్ ప్రభుత్వం రాగానే ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత కొన్నాళ్లకు సస్పెండ్ చేశారు.

తన సస్పెన్షన్ పై ఏబీ క్యాట్ కు వెళ్లారు. తన సస్పెన్షన్ గురించి.. కేంద్రానికి తెలియజేశారా అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రస్తుతం అప్పట్లో డ్రోన్ ల కొనుగోలుకు సంబంధించి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ జరిపిన టెండర్ కమిటీ సమావేశంలో పాల్గొనడమే ఏబీని ఇరికించేలా కనిపిస్తోంది. ఆ టెండరును తన కుమారుడి కంపెనీకి దక్కేలా ఆయన ప్రభావితం
చేశారనేది ఆరోపణలు ఉన్నాయి. రూ.25 కోట్ల విలువైన కొనుగోళ్లలో నాసిరకం పరికరాలతో కొనుగోలుచేసి అవినీతికి పాల్పడ్డారనేది తెలుస్తోంది. ప్రస్తుతం అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆ టెండరును రద్దుచేసి, బిల్లుల చెల్లింపు కూడా ఆపేశారు.

ఈ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అది వాస్తవమేనని నిరూపిస్తోంది. ప్రస్తుతం ఆ టెండరు రద్దు కావడంతో పరికరాల కొనుగోలు పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సో ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్ తప్పు అని క్యాట్ ఎదుట తెలిపారు. అక్రమాలను ప్రభుత్వం గుర్తించి ఆపివేయబట్టి నష్టం రాలేదు అని ఒప్పుకుంటూనే ప్రభుత్వానికి నష్టం రాలేదుగా అని చెప్పడంతో అంటే ప్రభుత్వంతో అతడి కుమారుడికి టెండర్ దక్కింది అనేది వాస్తవమేనని క్యాట్ గుర్తించింది. ఒకవేళ ఈ టెండర్ గమనించకపోయి ఉంటే నష్టం వాటిల్లేదేగా అని క్యాట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అక్రమాలు చేసినందుకు శిక్ష పడాలి గానీ.. ఆ అక్రమం పూర్తి కాకపోతే.. తప్పు చేసిన వారిని వదిలేస్తే ఎలా? అని ఏబీ వెంకటేశ్వర రావు అని వాదించాడంట. తాను చేసిన అక్రమం పూర్తి కాలేదు గనుక.. తనను విడిచిపెట్టమని ఏబీవీ కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన తప్పు పరోక్షంగా అంగీకరించి చిక్కుల్లో ఏబీవీ పడ్డాడు.