Begin typing your search above and press return to search.
మహనీయుడి అంత్యక్రియలు ఎక్కడ..?
By: Tupaki Desk | 28 July 2015 5:30 AM GMTశస్త్ర.. సాంకేతిక రంగాల్లో భారత్ ను ఎవరికి తీసిపోని విధంగా నిలపాలన్న ఒక మహర్షి విశ్రాంతిలోకి జారుకున్నారు. కనిపించని లోకాలకు పయనమైన అబ్దుల్ కలాంకు ఘన నివాళి అర్పించేందుకు దేశం యావత్తు సమాయుత్తమవుతోంది. ఆయన అంత్యక్రియలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తన సహచరులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం పది గంటలకు కేంద్ర మంత్రి వర్గం.. కలాం అంత్యక్రియలపై చర్చించేందుకు సమావేశం కానున్నారు.
ఆయన అంత్యక్రియలు ఎక్కడ చేయాలి? ఎలా చేయాలన్న అంశంపై చర్చిస్తారు. ఈ అంశంపై కేంద్రం తన నిర్ణయం తీసుకోక ముందే.. కలాం అంత్యక్రియలపై ఆయన మనమడు స్పందించారు.
తమ తాత అంత్యక్రియలను తమ ఊళ్లోనే నిర్వహించాలని.. అధికారిక లాంఛనాలతో పూర్తి చేయాలంటూ ఏపీజే అబ్దుల్ కలాం మనమడు సలీమ్ కేంద్రాన్ని కోరుతున్నారు. కలాం బంధువర్గమంతా తమిళనాడులోని ఆయన సొంతూరు రామేశ్వరంలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో.. ఆయన అంత్యక్రిమయలు రామేశ్వరంలోనే నిర్వహించాలని కోరుతున్నారు.
మరి.. సలీం విన్నపాన్ని మోడీ సర్కారు ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి. కలాం లాంటి మహానీయుడి అంతిమ సంస్కారాల్ని.. దేశ రాజధాని ఢిల్లీలో చేపడతారా? లేక.. వారి కుటుంబ సభ్యులు కోరిన విధంగా రామేశ్వరంలో నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఇలాంటి విషయాల్లో కుటుంబ సభ్యుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు.