Begin typing your search above and press return to search.
బ్రేకింగ్.. మనోడికి నోబెల్ పురస్కారం
By: Tupaki Desk | 14 Oct 2019 12:58 PM GMTనోబెల్ బహుమతి.. పుస్తకాల్లో చదవటం.. వార్తల్లో వినటమే తప్పించి.. నూట పాతిక కోట్ల మంది భారతీయుల్లో ఈ అత్యున్నత పురస్కారం వచ్చిన భారతీయులు వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. సుదీర్ఘకాలం తర్వాత ఆ మధ్యన అమర్త్యసేన్ కు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది.
తాజాగా ప్రకటించిన నోబెల్ పురస్కారంలో మన భారతీయుడు ఒకరి పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది. అయితే.. మీరు ఊహించినట్లు సదరు పెద్దమనిషి ప్రవాసభారతీయుడు. అంటే.. భారత మూలాలు ఉన్నా.. ప్రస్తుతం అతగాడి నివాసం మాత్రం విదేశంలోనే. ఆర్థిక రంగంలో మనోడికి వచ్చిన పురస్కారం భారతీయుల శక్తిసామర్థ్యాలు.. మేధావితనం ఎంతన్న విషయం ప్రపంచానికి మరోసారి తెలుస్తుందని చెప్పాలి.
ఈసారి నోబెల్ పురస్కారంలో మరో విశేషం ఉంది. ఆర్థిక శాస్త్రంలో మొత్తం ముగ్గురికి ప్రకటించగా.. వారిలో ఇద్దరు భార్యభర్తలు. ఆ భార్యభర్తలు ఎవరో కాదు.. మనోడు.. మనోడి శ్రీమతిగారు. ఇంతకీ మనోడి పేరు.. అభిజిత్ బెనర్జీ. ఆయన సతీమణి పేరు ఎస్తర్ డఫ్లో. విదేశీ మహిళ అయిన ఆమెను అభిజిత్ ప్రేమించి పెళ్లాడారు. వీరిద్దరితో పాటు.. మైఖేల్ క్రెమోర్ లతో కలిసి నోబెల్ పురస్కారాన్ని సాధించారు.
ప్రపంచవ్యాప్తంగా పేదరికానని నిర్మూలించేందుకు వీరు చేసిన పరిశోధనలు.. వారి ప్రతిపాదనలకు ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు నోబెల్ అవార్డుల కమిటీ ప్రకటించింది. 58 ఏళ్ల అభిజిత్ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు. అమర్త్యసేన్ కూడా బెంగాలీనే కావటం గమనార్హం. జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో ఏంఏ పట్టా పొందిన ఆయన.. అనంతరం విదేశాలకు వెళ్లి హార్వర్డ్ వర్సిటీలో పీహెచ్ డీ పూర్తి చేశారు.
ప్రస్తుతం ఆయన మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. సుదీర్ఘకాలం ప్రేమలో ఉన్న తన ప్రేయసి ఎస్తర్ ను ఆయన 2015లో పెళ్లాడారు.అమెరికాలో స్థిరపడిన అభిజిత్ పలు సందర్భాల్లో భారత్ లోని పరిస్థితులపై స్పందించారు. భారత్ మేథోతనానికి దక్కిన అత్యుత్తమ పురస్కారం భారతీయులకు సంతోషాన్ని మిగులుస్తుందని చెప్పటంలో సందేహం అక్కర్లేదు.