Begin typing your search above and press return to search.
అభినందన్ మాట: నన్ను మానసికంగా వేధించారు
By: Tupaki Desk | 2 March 2019 4:34 PM GMTఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ లో బందీగా ఉన్న సమయంలో తనను వేధించారని ఆయన వెల్లడించారు. అభినందన్ ను గత బుధవారం పాక్ ఆర్మీ బంధించిన సంగతి తెలిసిందే. పీవోకేలో మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ అభినందన్ గాయాలతో బయటపడ్డాడు. ముందుగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేసినా తర్వాత పాక్ ఆర్మీ ఆయనను అదుపులోకి తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాల ఒత్తిడితో - జెనీవా ఒప్పందం ప్రకారం పాక్.. అభినందన్ ను శుక్రవారం రాత్రి 9.20 గంటలకు వాఘా బార్డర్ దగ్గర భారత్ కు పాక్ అప్పగించింది.
అభినందన్ ఇండియాలో అడుగుపెట్టగానే అతన్ని నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు తీసుకెళ్లారు. అతని ఫిట్‌నెస్ స్థాయి తెలుసుకోవడానికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటుగా, పాకిస్థాన్ ఆర్మీ అతని శరీరంలో ఏమైనా ఉంచిందా అన్నది తెలుసుకోవడానికి వివిధ స్కాన్‌లు నిర్వహించనున్నారు. ఇక అభినందన్‌కు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చెరలో అతను ఉండటం, కొన్ని రోజుల పాటు షాక్‌లో గడపడం వల్ల శత్రు దేశం మన రహస్యాలను తెలుసుకోవడానికి అతన్ని హింసించిందా అన్నది ఈ పరీక్షల ద్వారా చూస్తారు. ఈ పరీక్షల సమయంలోనే కీలక అంశాలు బయటపడ్డట్లు సమాచారం. వర్థమాన్‌ను పాక్ ఆర్మీ శారీరకంగా వేధించనప్పటికీ.. మానసికంగా వేధించినట్టు తెలుస్తోంది. అభినందన్ పాకిస్థాన్‌లో దాదాపు 60 గంటలు ఉన్నారు. ఆసమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. అయితే.. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.