Begin typing your search above and press return to search.

అభినందర్ ఎంట్రీ ఇవ్వగానే ఏం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   5 May 2019 7:50 AM GMT
అభినందర్ ఎంట్రీ ఇవ్వగానే ఏం జరిగిందంటే?
X
శత్రుదేశం పాకిస్తాన్ విమానాన్ని వెంటాడి వేటాడి పాకిస్తాన్ లో కూలిపోయి బందీగా చిక్కినా చెక్కుచెదరని ధైర్యంతో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు విధుల్లో చేరారు.. గాయాల నుంచి పూర్తిగా కొలుకొని ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్ గా తేలడంతో అభినందన్ తిరిగి విధుల్లో చేరారు. జమ్మూ ఎయిర్ బేస్ లో రిపోర్ట్ చేశారు.

జమ్మూ ఎయిర్ బేస్ కు చేరుకున్న వింగ్ కమాండర్ అభినందర్ కు సహ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను చూడగానే భావోద్వేగంతో అందరూ చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అతడిని అభినందనలతో ముంచెత్తారు. దాదాపు రెండు నెలల తర్వాత సహచరులను చూసిన అభినందన్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సహ ఉద్యోగులతో కలిసి ఎయిర్ బేస్ లో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఆర్మీ జనరల్ మేనేజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

పాకిస్తాన్ కు చిక్కినా భారత వాయుసేన రహస్యాలు బయటపెట్టని అభినందన్ ధైర్యానికి దేశమే ఉప్పొంగిపోయింది. దాడిలో తీవ్రగాయాలు పాలు కావడంతో భారత ప్రభుత్వం అతడికి ప్రత్యేక చికిత్సను అందించింది. అనంతరం ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ లోనూ అభినందన్ సక్సెస్ కావడంతో అధికారులు మళ్లీ అభినందన్ కోరుకున్న చోటనే జమ్మూలోనే పోస్ట్ చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి