Begin typing your search above and press return to search.

అభినంద‌న్ శౌర్యాన్ని ట్వీట్ లో చెప్పేసిన ర‌క్ష‌ణ శాఖ‌!

By:  Tupaki Desk   |   3 March 2019 5:14 AM GMT
అభినంద‌న్ శౌర్యాన్ని ట్వీట్ లో చెప్పేసిన ర‌క్ష‌ణ శాఖ‌!
X
శ‌త్రువుల‌కు చిక్క‌టం ఒక ఎత్తు.. అక్క‌డి నుంచి క్షేమంగా దేశానికి చేర‌టం మ‌రో ఎత్తు. అయితే.. వీట‌న్నింటికి మించి స‌ద‌రు సైనికుడి ధైర్యాన్ని.. శౌర్యాన్ని ప్ర‌శంసిస్తూ ర‌క్ష‌ణ శాఖ త‌న‌కు తానుగా అభినంద‌న‌లు వ్య‌క్తం చేయ‌టం.. ట్వీట్ రూపంలో తానేం అనుకుంటున్న విష‌యాన్ని బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌టం అరుదైన విష‌యంగా చెప్పాలి. ఇవ‌న్నీ.. వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ విష‌యంలో చోటు చేసుకున్నాయి.

పాకిస్థాన్ లో ఉన్న స‌మ‌యంలో అభినంద‌న్ ప్ర‌ద‌ర్శించిన ధైర్యాన్ని తాజాగా ర‌క్ష‌ణ శాఖ పొగిడింది. భార‌త సాయుధ బ‌ల‌గాల్లో అత్యుత్త‌మ సైనికుడిని దేశం అత‌డిలో చూసింద‌ని ప్ర‌శంసించింది. ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేస్తూ.. జాతి గౌర‌వం కోసం మీరు.. మీ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త కంటే విధి నిర్వ‌హ‌ణ‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ప్ర‌శాంతంగా.. ధృఢంగా వ్య‌వ‌హ‌రించారు.. అభినంద‌న్ మీరు చ‌రిత్ర సృష్టించారు. భార‌త సాయుధ బ‌ల‌గాల్లో అత్యుత్త‌మ సైనికుడిని మీలో మేం చూశాం.. వైమానిక ద‌ళ వీరుడా శెబాష్ అంటూ ర‌క్ష‌ణ శాఖ ట్వీట్ చేసింది.

ఒక సైనికుడి జీవితంలో ఇంత‌కు మించిన గౌర‌వం ఇంకేం ద‌క్కుతుంది. ఇదిలా ఉంటే.. భార‌త్ కు అభినంద‌న్ ను అప్ప‌గించిన త‌ర్వాత ఆయ‌న‌కు ప‌లు ర‌కాల ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. భార‌త్ లోకి ప్ర‌వేశించిన రెండున్న‌ర గంట‌ల త‌ర్వాత రాత్రి 11.45 గంట‌ల వేళ‌లో ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి చ‌రుకున్న ఆయ‌న్ను త్రివిధ ద‌ళాల‌కు ప్ర‌త్యేక వైద్య ప‌రిశీల‌న జ‌రిపే వైమానిక ద‌ళ కేంద్రంలోని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

అనంత‌రం ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ రోజు (ఆదివారం) కూడా ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆసుప‌త్రిలో ఉన్న ఆయ‌న్ను.. కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ క‌లిశారు. ఆమెతో పాటు అభినంద‌న్ స‌తీమ‌ణి.. విశ్రాంత స్కాడ్ర‌న్ లీడ‌ర్ త‌న్వీ మార్వా.. వారి కుమారుడు.. అభినంద‌న్ సోద‌రి.. కొంత‌మంది సీనియ‌ర్ అధికారులు కూడా అభినంద‌న్ ను క‌లిసిన వారిలో ఉన్నారు.