Begin typing your search above and press return to search.
లాలీపాప్ పేరుతో ట్వీట్ తో జియోకు చురకలేశాడుగా
By: Tupaki Desk | 11 Oct 2019 9:19 AM GMTఏది ఉచితంగా రాదు అన్న యూనివర్సల్ నిజం ఇప్పుడు మరోసారి వాస్తవరూపం దాల్చిందంటున్నారు. మీరు చేసే అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని ఉచితం.. ఏ నెట్ వర్క్ కు అయినా అంటూ ఊరించేసిన జియోను ఎగబడి మరీ కొనేయటం తెలిసిందే. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త రూల్ తో నాన్ జియోకుచేసే ఔట్ గోయింగ్ కాల్ మీద నిమిషానికి ఆరు పైసలు విధిస్తూ రిలయన్స్ జియో ప్రకటన విడుదల చేయటం.. అదో సంచలనంగా మారటం తెలిసిందే. మొన్నటివరకూ ఉచితం కాస్తా.. ఇప్పుడు ఖరీదెక్కటం.. అదేమంటే ట్రాయ్ రూల్స్ చూపించటంపై ఎవరికి వారు.. వారికి నచ్చిన రీతిలో వాదనలు వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జియో నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత.. కేంద్ర మాజీ మంత్రి అభిషేక్ మను సింఘ్వీ ఆసక్తికర రీతిలో రియాక్ట్ అయ్యారు. జియో మీద ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ వినియోదారులపై ఛార్జీలు వేయాలని జియో నిర్ణయించింది. మీకు ఆఫర్ చేసిన లాలీపాప్ ఎంత పెద్దదైనా.. చివరకు ఏది ఉచితం కాదని ఎప్పుడూ గుర్తుంచుకోండి అంటూ అందరికి కనెక్ట్ అయ్యేలా ట్వీట్ చేశారు.
ఇంతకీ సింఘ్వీ గారి టార్గెట్ జియో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆయన అంతిమ లక్ష్యం మోడీనే. కాకుంటే.. ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయాల్ని కలిపి మోడీకి వ్యంగ్య బాణాన్ని ట్వీట్ రూపంలో వదిలారు. జియోను లాలీపాప్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రస్తుతం మోడీ సర్కారు పరిస్థితి కూడా ఇదేనంటూ.. ముక్తాయించారు. రోటీన్ కు కాస్త భిన్నంగా చేసిన ఈ ట్వీట్ విమర్శ ఇప్పుడు అందరి చూపు పడేలా చేస్తోంది.