Begin typing your search above and press return to search.
బాబు తెహల్కా వాళ్ల కాళ్లు పట్టుకున్నారట!!
By: Tupaki Desk | 17 Aug 2016 7:52 AM GMTనవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన తనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్మాది అనడంపై సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఉన్మాది అన్న వ్యక్తే ఉన్మాది అని ఆయన వ్యాఖ్యానించారు. తాను రాజధానికి వ్యతిరేకం కాదని… కానీ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి ముందుకెళ్తున్న తీరుపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. కార్పొరేట్ వ్యక్తులను కమిటీగా వేసి ప్రస్తుత రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఏబీకే విమర్శించారు. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం వల్ల హైదరాబాద్ విషయంలో ఏం జరిగిందో అదే పొరపాటు ఇప్పుడు జరుగుతోందని హెచ్చరించారు. రైతులు కూడా భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టుకు వెళ్లారని గుర్తుచేశారు. చంద్రబాబు అక్రమాస్తులపై గతంలో తెహల్కా పత్రికలో కథనాలు వస్తే ఆయన వెళ్లి వారిని కాళ్లావేళ్లా బతిమలాడుకుని ఆపించారంటూ సంచలన కామెంట్లు చేశారు.
ఏబీకే సాక్షిలో పనిచేసే ఉద్యోగి అంటూ ఒక మీడియా సంస్థ ప్రచారం చేయడంపైనా ఏబీకే స్పందించారు. తాను సాక్షి ఉద్యోగిని కాదన్నారు. వారం వారం రాసే వ్యాసాలకు ఇచ్చే గౌరవవేతనం తప్ప ప్రస్తుతం తనకు ఎలాంటి ఆదాయ వనరు లేదన్నారు. సుప్రీంలో పిటిషన్ వేయడం వెనుక రాజకీయ అండదండలున్నాయన్న ఆరోపణలనూ ఖండించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించాలా వద్దా అన్న దశలో పెద్దగా ఖర్చు ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. పిటిషన్ వేసినందుకు అయిన 10వేల రూపాయల ఖర్చును సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవణ్ భరించారని చెప్పారు. సుప్రీం తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్తామన్నారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లలో ఒకతను… ఒకప్పుడు సైకిల్ మీద వచ్చిపోతూ తన కింద పనిచేసిన వ్యక్తేనంటూ ఓ మీడియా సంస్థ అధినేతపై ఏబీకే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఇంతకుముందు టెర్ముల్లో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను తాను వ్యతిరేకించారని.. అప్పుడు కూడా తనను టార్గెట్ చేశారని.. కానీ, అప్పటి నిర్ణయాల ఫలితంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విఫయమేనని అన్నారు. చంద్రబాబు అక్రమార్జనపైనా ఏబీకే నిప్పులు చెరిగారు. కేవలం రెండున్నర ఎకరాలున్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏకంగా రూ.3వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని అప్పట్లో తెహల్కా పత్రిక బయటపెడితే.. చంద్రబాబు ఆ పత్రిక పెద్దల కాళ్లు పట్టుకుని తన వివరణ వేయించుకున్నారని చెప్పారు. తాను చేస్తున్న న్యాయ పోరాటాన్ని జగన్ తో ముడిపెట్టడం కరెక్టు కాదన్నారు.