Begin typing your search above and press return to search.
షాతో ఆంధ్రజ్యోతి ఆర్కే భేటీ.. సారాంశం ఇదేనట
By: Tupaki Desk | 7 Oct 2019 5:40 AM GMTవారిద్దరూ మీడియా అధినేతలే అయినా వారి వ్యవహారశైలి మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇంతకూ ఆ ఇద్దరు మీడియా ప్రముఖులు మరెవరో కాదు.. ఒకరు ఈనాడు అధినేత రామోజీరావు.. మరొకరు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ రాధాకృష్ణ. తనకు సంబంధించిన విషయాల్ని పత్రికలో వచ్చేందుకు రామోజీ అస్సలు ఇష్టపడరు. చాలా ముఖ్యులతో తరచూ సమావేశమైనా.. అవన్నీ పత్రికలో అచ్చు వేయదగిన వార్తలుగా ఆయన భావిస్తారు. టీవీ ఛానళ్ల హడావుడితో కాస్త తగ్గి.. తాను భేటీ అయిన ప్రముఖులకు సంబంధించిన వార్తను మూడుముక్కల్లో తేల్చేస్తుంటారు.
ఇందుకు భిన్నంగా ఆంధ్రజ్యోతి ఆర్కే వ్యవహరిస్తారు. తాను భేటీ అయిన ప్రముఖులకు సంబంధించిన వివరాల్ని వార్తల రూపంలో అచ్చేయిస్తుంటారు. అలా అని జరిగిన విషయాలు వెల్లడించరు కానీ.. ఏం జరుగుతుందన్న అవగాహన కలిగించే ప్రయత్నం మాత్రం చేస్తుంటారు. తాజాగా ఢిల్లీలో కేంద్రమంత్రి కమ్ బీజేపీ రథసారధి అమిత్ షాను ఆయన నివాసంలో ఆర్కే మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అచ్చేసిన వార్తలో.. తాను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పేందుకు వెనుకాడలేదు. తాను అమిత్ షాతో భేటీ కాలేదని.. అమిత్ షా ఆహ్వానం మేరకే వారి ఇంటికి వెళ్లి సమావేశమైన విషయాన్ని తన మీడియా సంస్థలో అచ్చేసిన వార్తలో పేర్కొన్నారు.
దీని ద్వారా చెప్పొచ్చేదేమంటే.. అమిత్ షాకు తమకు మధ్య సంబంధాలు మరింత సన్నిహితంగా మారినట్లు చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు.. తమ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగినట్లుగా పేర్కొన్నారు. ఈ తరహా భేటీల్ని వార్తాంశాలు కాని విషయాలుగా పక్కన పెట్టేసేవారు. కానీ.. ఆర్కే అందుకు భిన్నంగా వార్తగా ప్రచురించి రికార్డు చేయించటం కనిపిస్తుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ తరహా భేటీలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ సాగేవి. కాకుంటే.. వారికి చేతకానిది.. మోడీషాలకు చేతనైనది ఏమంటే.. తాము చేపట్టే ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంను దేశంలోని ప్రముఖులకు.. మీడియా సంస్థలకు వివరించేందుకు వీలుగా ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెబుతూ.. వారి ఇళ్లకు వెళుతుంటారు. మోడీ సర్కారు ఇటీవల తీసుకున్న ఆర్టికల్ 370 నిర్వీర్యం నిర్ణయానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించేందుకు.. ప్రభుత్వం ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకుందన్న విషయాన్ని చెప్పేందుకు వీలుగా కేంద్రమంత్రులు పలువురు.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల వద్దకు వెళుతున్న విషయం తెలిసిందే.
ఇదే పని మరో కేంద్రమంత్రి ధరేంద్ర ప్రదాన్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. వారిలో ఆంధ్రజ్యోతి ఆర్కే ఒకరు. కానీ.. మిగిలిన ప్రముఖులెవరికి అమిత్ షా నుంచి పిలుపు రాలేదు. అందుకు భిన్నంగా ఆంధ్రజ్యోతి ఎండీకి మాత్రం షా నుంచి నేరుగా పిలుపు వచ్చింది. తన ఇంటికి రావాలన్న కబురుతో పాటు.. ఏకంగా గంటన్నర పాటు మాట్లాడేందుకు ఆసక్తి చూపటం ఇప్పడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాలకు ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా లైన్ తీసుకుందన్న విషయం తెలుగు నేల మీద చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అలాంటి వేళలో.. తనకు అవసరమైన రక్షణను కేంద్రంలోని కమలనాథులతో తీసుకునేందుకు వీలుగా ఇటీవల పావులు కదిపిన ఆర్కే.. ఆ క్రమంలోనే తాజాగా షాతో భేటీ జరిగిందని చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ మీద వ్యతిరేక కథనాలు అచ్చేసి.. బీజేపీ అండ్ కో వర్గాలకు లక్ష్యంగా మారిన జ్యోతి ఆర్కే.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎంత మిత్రుడయ్యారన్న విషయం తాజా భేటీకి సంబంధించిన వార్తను చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. ఇదే వార్తలో చివర్లో చెప్పినట్లు.. రెండు తెలుగురాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల్ని ఇరువురు చర్చించినట్లుగా పేర్కొనటం చూస్తే.. చెప్పాలనుకున్న విషయాన్ని తనదైన రీతిలో ఆర్కే తన మీడియాలో చెప్పేసుకున్నారని చెప్పాలి.