Begin typing your search above and press return to search.
ట్వీటమ రాయుడు - పవన్ కు ఆర్కే కొత్త పేరు!
By: Tupaki Desk | 22 April 2018 6:50 AM GMTమీడియా పై పవన్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ తొలుత ట్వీట్లతో అందరి మీదా కౌంటర్లు వేస్తున్నాడు. దొరికిన మేరకు సాక్ష్యాలు పెట్టి ఆరోపణలు చేస్తున్నాడు. డ్రీమ్ టీమ్ అనే పేరుతో ఒక కమిటీ తన మీద కుట్ర పన్నుతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే, ప్రతి ఆదివారం తన పత్రికలో *కొత్తపలుకు* పేరిట రాసే కాలమ్ ను ఈరోజు ఆర్కే పవన్‌కు అంకితం ఇచ్చాడు. పవన్ గురించి పలు విషయాలను అందులో చర్చించిన వేమూరి రాధాకృష్ణ కాటమరాయుడు సినిమా చేసిన పవన్ ను *ట్వీటమరాయుడు* అంటూ కొత్త పేరుతో నామకరణం చేశారు.
*అసలు పవన్ కు చంద్రబాబుతో విభేదాలు వస్తే నిజానిజాలతో సంబంధం లేకుండా నా పేరు లాగడం ఏంటి? పవన్‌ను ఉన్నతంగా ఊహించుకున్నాను. కానీ ఆయన నన్ను నిరాశ పరిచారు. రేణు దేశాయ్‌ని ప్రత్యక్షంగా పచ్చిబూతులతో తిడితే ఏమీ అనని పవన్, తన తల్లిని ఉద్దేశించి ఏమీ అనకపోయినా పవన్ కళ్యాణ్ దానిని రాజకీయం చేసి వాడుకుంటున్నారు. అసలు మా వాళ్లను అడిగాను. పీకే పెట్టిన ఆ వీడియో ఏబీఎన్ ప్రసారం చేయలేదు. సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని పవన్ వెల్లడించిన అభిప్రాయాన్నికరెక్టని చెప్పిన నా మీద పవన్ బురదజల్లుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్నిచోట్ల ఉందని సినిమాను మాత్రమే లోకువ చేయొద్దని సూచించిన నాకు పవన్ ఇలాంటి వాటిలో లాగుతాడా? ఇది ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తోంది. ఆవేశపడితే అనర్థమే. రెచ్చిపోవడానికి అభిమానులు ఉన్నారని మీడియా పై దాడులు చేయించడం బల ప్రదర్శన కాబోదు. బలహీనత అవుతుంది.
వర్మ చేసింది తప్పు అని నేను అప్పుడే చెప్పాను. వర్మకు -మెగా కుటుంబానికి ఏవో గొడవలున్నాయి. దాంతో అతను వాళ్లను ఇబ్బంది పెడుతున్నాడు అదేంటో వర్మకే తెలియాలి. నాకు డౌటొచ్చి కొందరినీ అడిగితే వాళ్లకీ తెలియదన్నారు.* అంటూ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ఎన్ని చెప్పినా ఆర్కే పెట్టిన పేరు మాత్రం ట్రెండింగ్!