Begin typing your search above and press return to search.

రాధాకృష్ణ..కొత్త నీతులు..న‌వ్విపోతున్నారుగా...!

By:  Tupaki Desk   |   14 July 2019 5:30 PM GMT
రాధాకృష్ణ..కొత్త నీతులు..న‌వ్విపోతున్నారుగా...!
X
వారం వారం.. త‌న ప‌దునైన క‌లం నుంచి కొత్త ప‌లుకులు ఆవిష్క‌రించే ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌.. గ‌తంలో ఎలా ఉన్నా.. ఇంకా.. ఇప్ప‌టికీ.. ఆయన రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింద‌నే విష‌యాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో చంద్ర బాబు పాల‌న అంత‌రించి 40 రోజులకు పైగానే అయింది. అయినా కూడా రాధాకృష్ణ మాత్రం ఇంకా చంద్ర‌బాబు సీఎం సీట్లోనే ఉన్న‌ట్టుగా భావిస్తున్న‌ట్టుగా ఉన్నారు కొత్త‌ప‌లుకు చూస్తే! ప్ర‌జాస్వామ్యం.. అధికారం ఎవ‌రి సొంత‌మూ కాదు.. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పులకు ఎవ‌రైనా బ‌ద్దులు కావాల్సిందే. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ సీఎం అయ్యారు. ప్ర‌జ‌లు ఏరికోరి ఆయ‌న‌కు ప‌ద‌విని, ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకునే అవ‌కాశాన్నీ క‌ల్పించారు.

అయితే, రాధా కృష్ణ‌గారికి మాత్రం చంద్ర‌బాబుపై అభిమానం చావ‌న‌ట్టుగా క‌నిపిస్తోంది. అయితే, ఇది ఆయ‌న వ్య‌క్తిగత మైతే.. ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌దు. కానీ, త‌న వ్య‌క్తిగ‌తాన్ని కూడా ప్ర‌జ‌ల‌పై రుద్దేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు ఆయ‌న జ‌గ‌న్‌పై ప‌రోక్షంగా నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం, స‌భా నాయ‌కుడి హోదాలో ఉన్న జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్షం టీడీపీ పైనా - ఆపార్టీ అదినేత చంద్ర‌బాబుపైనా విరుచుకుప‌డ‌డ్డాన్ని టీడీపీ నేత‌లు స‌హిస్తున్నా.. రాధాకృష్ణ మాత్రం స‌హించ‌లేక పోతున్నారు. త‌న పెన్నుతో ఏకేస్తున్నారు. తాజాగా ఆయ‌న వండి వార్చిన కొత్త‌ప‌లుకులో .. చిత్ర‌మైన చ‌ర్చ‌కు తెర‌దీశారు.

జగన్ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రదర్శించిన నిర్లక్ష్యమే కారణం. జగన్ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోలేకపోవడం ఆయన తప్పు అవుతుంది- అని పేర్కొన్న ఆర్కే.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి ప్రదర్శిస్తున్న హావభావాలను ఆయనకు ఓటేసినవారు కూడా జీర్ణించుకుంటారనుకోలేం అంటూ... జ‌గ‌న్‌పై త‌న క‌సిని ప్ర‌ద‌ర్శించేశారు. రాజశేఖర్‌ రెడ్డిని ఆయన కుమారుడైన జగన్ మోహన్‌ రెడ్డిలో చూసుకుందామని ఓటేసిన వారు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు- అంటూ.. ఎవ‌రి మ‌న‌సులోనో దూరి వారి భావాల‌ను కూడా తానే తెలుసుకున్న‌ట్టు ఆర్కే వండి వార్చారు.

ప‌నిలో ప‌నిగా ఆయ‌న రాసిన మ‌రో నీతివాక్యం ఏంటంటే.. అనుకూల ధోరణిని ప్రదర్శించడం ద్వారా కూడా చంద్రబాబుని రాజకీయంగా కోలుకోకుండా జ‌గ‌న్‌ చేయవచ్చు. ముఖ్యమంత్రిగా అపార అనుభవమున్న చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టాలంటే ‘‘కీలకమైన ప్రభుత్వ వ్యవహారాలలో మీ సలహా ఇవ్వండి’’ అని కోరితే ఎలా ఉంటుందో జగన్ మోహన్‌ రెడ్డి ఆలోచించడం మంచిది. చంద్రబాబు సలహాలు - సూచనలు తీసుకుంటున్నట్టు ప్రజలు అభిప్రాయపడేలా చేయగలిగితే, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం చంద్రబాబుకు ఉండదు కదా?- అని ఆర్కే వారు ముక్తాయించారు.

అయితే, నిజానికి చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు, ఆయ‌న విధానాలు న‌చ్చ‌లేదు కాబ‌ట్టే క‌దా.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఘోరంగా ఓడించారు. ఇప్పుడు పోయి పోయి.. అఖండ మెజారిటీ ఉన్న జ‌గ‌న్ ఆయ‌న స‌ల‌హాలు తీసుకోవాలా? అంటే.. ఆయ‌న‌కంటూ.. ఏమీ సొంతంగా ఆలోచ‌న చేసే శ‌క్తి,యుక్తి లేదా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏదేమైనా.. ఆర్కే `క‌మ్మ‌`టి మాట‌లు టీడీపీ నేత‌లకు న‌చ్చుతాయేమో కానీ.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మాత్రంకాద‌ని అంటున్నారు.