Begin typing your search above and press return to search.
అందుకే మోడీతో కేసీఆర్ లెక్క చెడిందా?
By: Tupaki Desk | 7 July 2019 7:09 AM GMTప్రధానమంత్రి మోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య లెక్క ఎందుకు తేడా వచ్చింది? సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ ఇరువురు నేతల మధ్య నడిచిన అనుబంధం స్వల్ప వ్యవధిలోనే ఎందుకు చెడింది? ముందస్తు ఎన్నికలకు తన ఆలోచనలకు తగ్గట్లుగా పనులు చేయించుకోగలిగిన కేసీఆర్ .. తర్వాతి కాలంలో మోడీ అపాయింట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లభించలేదు. కొందరు చేసిన విశ్లేషణలు అతకని రీతిలో ఉన్నాయే తప్పించి.. నిజమే కదా? అన్నట్లు లాజిక్ కు దగ్గరగా ఉన్నట్లు కనిపించదు. ఇలాంటివేళ.. మీడియా అధినేత ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణ ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.
సహజంగానే పొలిటికల్ జర్నలిస్ట్ అయిన ఆయన మీడియా అధినేతగా మారినప్పటికీ.. రిపోర్టర్ మాదిరి అనునిత్యం పలువురితో భేటీ కావటం.. రాజకీయంగా ఏమేం జరుగుతుందన్న విషయాల మీద సమాచారం సేకరిస్తూ ఉంటారు. అంతేనా.. కొన్ని కీలక భేటీల కోసం ఆయన విందు సమావేశాల్ని కూడా నిర్వహిస్తుంటారు.
తనకు అందిన సమాచారంలో వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాల్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రతివారం తన కాలమ్ ద్వారా కొత్త సంగతులు తెర మీదకు తెస్తుంటారు. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పారు. ఆర్కే చెప్పిన దాన్లో లాజిక్ ఉండటమే కాదు.. చదివినంతనే నిజమే కదా? అన్న భావనతో ఉండటం గమనార్హం. ఇంతకూ ఆర్కే ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
"కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించారని విన్నాం. కేసీఆర్ కూడా తరచుగా నరసింహన్‌ను కలిసి గంటలకొద్దీ సమాలోచనలు జరిపేవారు. అలాంటిది, గవర్నర్ వైఖరిలో హఠాత్తుగా ఇప్పుడు ఇంత మార్పు ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కు - కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మధ్య సంబంధాలు చెడిపోవడమేనని చెప్పవచ్చు. ఎన్నికల ముందు వరకు ఉభయ పక్షాల మధ్య సంబంధాలు సజావుగానే ఉండేవి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ వ్యవహరించిన తీరుతో బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు"
"కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమార స్వామికి - తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కు - ఉత్తరప్రదేశ్ లో మాయావతికి - పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారని బీజేపీ నాయకత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉందట! ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రాంతీయ పార్టీల నాయకుల మద్దతుతో కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఆలోచనతోనే కేసీఆర్ వారికి ఆర్థిక సహాయం చేశారని బీజేపీ పెద్దలు అంచనాకు వచ్చారు"
"దీంతో, ముందుగా కేసీఆర్ పని పట్టాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించుకున్నారని సమాచారం. ‘తాజా ఎన్నికల్లో లభించిన విజయంతో నేను సంతృప్తి చెందడం లేదు. దక్షిణాదిన కర్ణాటక - తెలంగాణ రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చినప్పుడే నేను సంతృప్తి చెందుతాను’ అని ఇటీవల తనను కలిసిన తెలంగాణకు చెందిన పార్టీ నాయకుల వద్ద అమిత్ షా వ్యాఖ్యానించారు"