Begin typing your search above and press return to search.

2019లో మోడీ గెలుపు అంత ఈజీకాదట..

By:  Tupaki Desk   |   25 May 2018 11:15 AM GMT
2019లో మోడీ గెలుపు అంత ఈజీకాదట..
X
2014 ఎన్నికలు.. మోడీ ఒంటి చేత్తో అఖండ భారతాన్ని జయించి కాషాయ జెండాను ఢిల్లీలో ఎగురవేశారు. ఈ నాలుగేళ్లు మోడీ ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే మోడీ మేనియా మునుపు ఉన్నంత వేడిగా లేదు.. ఆయన పథకాలు.. చేష్టలు ప్రజా వ్యతిరేకతకు దారితీశాయి.. 2014లోలా మోడీ అనగానే ఓట్లు గుద్దే పరిస్థితి ఉండేది. అయితే ఈ 2019లో అది ఉండదు.. ఇది నిజం..

తాజాగా ఏబీపీ-సీఎస్ డీఎస్ సర్వే నిర్వహించింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట చేసిన ఈ సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.. వచ్చే 2019 ఎన్నికల్లో కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుంది.. కానీ అనుకున్నంత విజయం మాత్రం సాధ్యం కాదని తేల్చింది. ఎన్టీఏ కూటమి 274 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ మార్క్ 273 కాగా.. కేవలం ఒక్క ఎంపీ సీటు మాత్రమే వస్తుందని.. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదని తేల్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో మోడీకి చావు తప్పి కన్నులొట్టబోవడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి..

ఇక కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కు 164 సీట్లు వస్తాయని సర్వే అంచనావేసింది. ఇక యూపీయేతర, ఎన్డీయేతర పార్టీలుగా ఉన్న ప్రాంతీయపార్టీలన్నీ 105 సీట్లను సొంతం చేసుకుంటాయని సర్వే అభిప్రాయపడింది.

కానీ ఓట్ల శాతంలో మాత్రం మోడీ వెనుకబడడం ఖాయమని తేల్చారు. మోడీకి 274 సీట్లు 37శాతం మాత్రమే ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని.. కాంగ్రెస్ కు 31శాతం 164 సీట్లు దక్కుతాయని తేల్చింది. ఆశ్చర్యకరంగా ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ కంటే ఎక్కువగా 32శాతం ఓట్లు వస్తాయని తేలింది.

ఇక ముందునుంచి బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో బీజేపీకి మొత్తం 132 ఎంపీ సీట్లలో కేవలం 22 మాత్రమే దక్కుతాయని సర్వే తేల్చింది. మోడీ బోటాబోటీగానే గెలుస్తారని సర్వే తేల్చడంతో అటూ ఇటూ అయితే అధికారం కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారుతాయి.. చంద్రబాబు, కేసీఆర్ లాంటి వారికి మోడీని చెడుగుడు ఆడే అవకాశం దక్కుతుంది. సో వచ్చే ఎన్నికల్లో గెలుపు పూలపాన్పు కాదని.. మోడీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.