Begin typing your search above and press return to search.
ఏబీపీ-సీఓటర్ ఓపినియన్ పోల్ : ఐదు రాష్ట్రాల్లో గెలిచే అవకాశం వీరికే..?
By: Tupaki Desk | 11 Jan 2022 7:28 AM GMTసెమీఫైనల్ లాంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
జాతీయ మీడియా న్యూస్ ఛానల్ ఏబీపీ న్యూస్ సీఓటర్ తో కలిపి నిర్వహించిన ఒపినీయన్ పోల్ లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు వెలుగుచూశాయి.
ఐదు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల గెలుపు, ఓటములు, ఓట్ల శాతాలకు సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ తో మొదలుపెట్టి చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్ వరకూ ఈ ఒపినీయన్ పోల్ పలు అంశాలను బయటపెట్టింది.
-ఉత్తరప్రదేశ్ లో..
ఏబీపీ న్యూస్ సీఓటర్ ఒపినీయన్ పోల్ ప్రకారం 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సమాజ్ వాదీ పార్టీ తన ఓట్ల శాతాన్ని 23.6 నుంచి 33.5 వరకూ పెంచుకోబోతోందని తేలింది. కొద్దినెలల క్రితం కూడా సమాజ్ వాది పార్టీ సాధించే ఓట్ల శాతం 30శాతం కంటే తక్కువగానే ఉండగా.. తాజాగా అది 33 శాతం దాటిపోతోందని తేలింది.
సమాజ్ వాదీ పార్టీ బీజేపీకి ఉన్న 35 శాతం నిక ఓట్ల శాతాన్ని దాటాలంటే కాంగ్రెస్ కు ఉన్న 7శాతం ఓట్లు కూడా కలుపుకోవాల్సి ఉంటుందని నిర్ధారణ అయ్యింది.
అయితే తాజా అంచనాల్లో బీజేపీకి గతంలో లభించిన 41 శాతం ఓట్లు కొనసాగే అవకాశమున్నట్లు తేలింది. బీఎస్పీ ఓట్ల శాతం గత ఎన్నికల్లో ఉన్న 22 శాతం నుంచి 12 శాతానికి ఈసారి పడిపోనుంది. ఈ ఓట్లను చీల్చగలిగే పార్టీయే విజేతగా నిలవనుంది.
పశ్చిమ యూపీలో రైతు నిరసనల ప్రభావం బీజేపీపై పడితే మాత్రం అక్కడ బీజేపీకి ఉన్న 41శాతం ఓట్లు 33 శాతం కలిగిన సమాజ్ వాదీ పార్టీ లాక్కోవచ్చు. అలాగే ప్రియాంక గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎన్ని హామీలిస్తున్నా గతంలో గెలిచిన 7 సీట్లకు మించకపోవచ్చని అంటున్నారు.
-ఉత్తరఖండ్ లో..
ఇక ఉత్తరాఖండ్ లో మళ్లీ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీష్ రావత్ 37 శాతం మద్దతుతో ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి కంటే చాలా ముందున్నారు. సీఎం పుష్కర్ సింగ్ కు కేవలం 29 శాతం ఓటర్ల మద్దతు మాత్రమే లభిస్తోందని ఏబీపీ న్యూస్ సీఓటర్ తెలిపింది. బీజేపీ ఏడాదిలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఉత్తరాఖండ్ లో ప్రస్తుతం బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ 34, కాంగ్రెస్ 33 సీట్లు గెలుస్తాయని అంచనా..
-పంజాబ్ లో ఆప్, కాంగ్రెస్ హోరాహోరీ
ఏబీపీ న్యూస్ -సీఓటర్ ఒపినియన్ పోల్ లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వరుసగా 40 శాతం, 36 శాతం ఓట్లను సాధిస్తాయని అంచనా.. హోరా హోరీ తప్పందంటున్నారు.
-గోవాలో బీజేపీకే ఛాన్స్
చిన్న రాష్ట్రం గోవాలో 32శాతం ఓట్లతో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది. అలాగే 23శాతం ఓట్లతో ఆప్ ఇక్కడ ప్రధాన విపక్ష పార్టీగా ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ 19 శాతం మూడో స్థానానికి పరిమితమైంది. 40 సీట్ల అసెంబ్లీకి బీజేపీకి 21, ఆప్ కు 7, కాంగ్రెస్ కు 6 సీట్లు వస్తాయని అంచనా..
-మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ తప్పదు. బీజేపీకి 25 సీట్లు, కాంగ్రెస్ కు 24 సీట్లు దక్కవచ్చని తేలింది. నాగాజాతి పార్టీ కి 4 స్థానాలు దక్కొచ్చు.