Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు త‌గిలిన తాజా షాక్ ఏంటంటే....

By:  Tupaki Desk   |   13 Jun 2017 6:04 AM GMT
ట్రంప్‌ కు త‌గిలిన తాజా షాక్ ఏంటంటే....
X
తాను అనుకున్న‌దే సాగాల‌నే భావ‌న‌తో మొండిగా వెళ్తున్న అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రయత్నాలు ఆయ‌న‌కే బెడిసికొడుతున్నాయి. ట్రంప్‌ తీసుకునే నిర్ణయాలకు అక్కడి న్యాయస్థానాల్లో పరాభవం ఎదురవుతోంది. ట్రంప్ ప‌ట్టుబ‌ట్టి తీసుకువచ్చిన ట్రావెల్‌ బ్యాన్‌ ను నిలిపివేస్తూ కింది కోర్టు ఆదేశాలిచ్చిన విషయం విదితమే. దీనిపై మళ్లీ ట్రంప్‌ సర్కారు అమెరికా అప్పీల్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే కింది కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అప్పీల్‌ న్యాయస్థానం సమర్థించింది.

ఆరు దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రంప్‌ ప్రభుత్వం 90 రోజుల పాటు ఆంక్షలు విధించింది. అయితే దేశాధినేత తీసుకున్న ఈ నిర్ణ‌యం, వెలువ‌రించిన ఆదేశాలు వివక్షతతో కూడుకున్నవని హవాయి రాష్ట్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ట్రంప్ ఆదేశాల‌పై ఇంజెక్షన్‌ ఆర్డరును జారీ చేసింది. త‌ద్వారా ట్రంప్ జోరుకు బ్రేకులు వేసింది.

ఇదిలాఉండ‌గా... ట్రంప్‌ పై భారత సంతతికి చెందిన అమెరికా మాజీ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్‌ ప్రీతా భరారా ఆరోపణలు చేశారు. ట్రంప్‌ కు వ్యతిరేకంగా అమెరికా ఎన్నికలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, దానిపై కేసు కూడా నడిచే అవకాశాలున్నాయ‌ని ఇటీవ‌ల భ‌రారా పేర్కొన్నారు. ఈ విషయంపై ట్రంప్‌ ఫోన్లు చేసి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీంతో ట్రంప్ వ్య‌వ‌హార‌శైలిపై అమెరికాలో ప‌లువురు విప‌క్ష నేత‌లు విరుచుకుప‌డ్డారు. దేశాధ్యక్షుడి హోదాలో ఉన్న వ్య‌క్తి త‌న గౌర‌వాన్ని ఇలా దిగ‌జార్చుకోవ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/