Begin typing your search above and press return to search.
అమెరికన్ పై బకర్ అలీ అత్యాచారకాండ
By: Tupaki Desk | 16 Aug 2015 6:53 AM GMTఇస్లామిక్ స్టేట్ ఆరాచక పర్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుల రూపంలో ఉన్న ఈ రాక్షస జాతికి చెందిన నేత అబూ బకర్ అల్.. బాగ్దాదీ చేసిన ఆరాచక పర్వానికి సంబంధించిన కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల అబూ బకర్ మరణించినట్లుగా అనధికార సమాచారం వెలువడగా.. అతగాడు బతికున్న సమయంలో పాల్పడిన దారుణాల గురించి.. అతని దగ్గర బంధీగా ఉండి ఇటీవల తప్పించుకున్న ఒక బానిస మహిళ ది ఇండిపెండెంట్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన కైలా ముల్లర్ అనే మహిళను ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అమెను.. ఆమె స్నేహితుడ్ని 2013లో కిడ్నాప్ చేశారు. అనంతరం స్నేహితుడ్ని చంపేసిన ఐఎస్ తీవ్రవాదులు.. అమెరికన్ మహిళ కైలాను ఐఎస్ నేత బకర్ అలీ పలుమార్లు అత్యాచారం చేసేవాడని పేర్కొంది.
కైలా ఉండే ఇంటికి వచ్చిన ప్రతిసారి.. మిగిలిన మహిళల్ని ఒక గదిలో ఉంచి.. కైలాను ఈడ్చుకుంటూ తనతో తీసుకెళ్లి అత్యాచారం చేసే వాడని ఆమె పేర్కొంది. అయితే.. ఈ ఏడాది ప్రారంభంలో జోర్డాన్ దగ్గర యుద్ధ విమానాలు జరిపిన దాడిలో కైలా మరణించినట్లు చెప్పుకొచ్చింది. అయితే.. ఆమె మరణాన్ని అమెరికా మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించకపోవటం గమనార్హం.