Begin typing your search above and press return to search.

ముస్లిం దేశంలో హిందూ ఆలయ నిర్మాణం..అది కూడా వందల కోట్లతో

By:  Tupaki Desk   |   29 March 2021 3:42 AM GMT
ముస్లిం దేశంలో హిందూ ఆలయ నిర్మాణం..అది కూడా వందల కోట్లతో
X
అత్యంత జనాభా గల దేశాల్లో భారత దేశం ఒకటి. చైనా తర్వాత భారత్ లోనే అత్యధికంగా జనాభా ఉంది. దేశంలో జనాభా అధికం కావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, వ్యాపారం నిర్వహించడం కోసం ప్రపంచంలోని పలు దేశాల్లో భారతీయులు స్థిరపడ్డారు. గల్ఫ్ కంట్రీస్ లో కూడా భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. కాగా ప్రస్తుతం అబుదాబిలో ఒక పెద్ద హిందూ దేవాలయం నిర్మిస్తున్నారు. గుడి అంటే ఏదో ఒక చిన్న నిర్మాణం కాదు. 880 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బోచసన్వాసీ శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేలా ఈ సంస్థ ఆలయాన్ని నిర్మిస్తోంది.

జనవరిలో ఈ ఆలయ పనులు ప్రారంభమై ఏప్రిల్ నెలాఖరు కల్లా పునాది రాళ్ళు పూర్తి చేయనున్నట్లు ఈ ప్రాజెక్టు ఇంజనీర్ అశోక్ కొండేటి తెలిపారు. మే నుంచి రాతి కట్టడం పనులు ప్రారంభం కానుండగా, రాళ్లు, రాతి స్తంభాలు భారతదేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. భారత్ లోని పురాతన ఆలయాలకు ఏమాత్రం తీసి పోకుండా, ఇక్కడి ఆలయంలో సంస్కృతిని చాటి చెప్పేలా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది శిల్పకారులు ఇక్కడికి రప్పించి ఆలయానికి అవసరమైన రాతి స్తంభాలు శిల్పాలను చెక్కే పనులు చేయిస్తున్నారు. ఒక్క ఆలయ నిర్మాణ పనులను 2000 మంది శిల్పులతో చేయిస్తున్నారంటే ఆలయం ఏ స్థాయిలో నిర్మిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు.

ఆలయంలోని ప్రత్యేకతలు ఇవే..

ఆలయ రాతి స్తంభాలపై దేశ సంస్కృతిని చాటేందుకు మహాభారతం, రామాయణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను, దేశ సంప్రదాయాన్ని చాటిచెప్పే సాంప్రదాయాలను కళ్లకు కట్టేలా శిల్పాలను చెక్కుతున్నారు. శిల్ప శాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు ఇంజనీర్ అశోక్ తెలిపారు. సముద్ర మట్టానికి సుమారు 4.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ఆలయాన్ని 2023 కల్లా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం అబుదాబిలో స్థిరపడ్డ హిందువులు ఎక్కువే. ఒక ముస్లిం దేశంలో 880 కోట్ల రూపాయలతో ఒక భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించడం విశేషమే.