Begin typing your search above and press return to search.
మహిళలకు హక్కులంటే ఇస్లాంకు విరుద్ధమే
By: Tupaki Desk | 28 Nov 2015 4:34 PM GMTమహిళలకు కట్టుబాట్లు విధించడంలో ముందుండే ఇస్లాం మతంలోని కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆ మతాచారాల ప్రకారం మహిళలకు స్వేచ్ఛ పరిమిత స్థాయిలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చింది కూడా ముస్లిం మతపెద్ద కావడం విశేషం.
కేరళలోని కోజికోడ్‌లో జరిగిన సున్నీ ముస్లింల సమావేశంలో ప్రముఖ ముస్లిం సున్నీ లీడర్ అయినఅబూబాకర్ ముస్లియార్ మాట్లాడుతూ లింగ సమానత్వం అనేది వాస్తవదూరం అని చెప్పారు. అంతే కాదు పురుషులతో సమానంగా మహిళలు ఉండటం జరిగేది కాదని కూడా తేల్చిచెప్పారు. "మహిళలు పిల్లలను మాత్రమే కనాలి. ఈ ప్రపంచాన్ని నడిపించేది మనుషులే. మహిళా డాక్టర్లకు పెద్ద, ప్రమాదకరమైన ఆపరేషన్లు కూడా చేసే సత్తాలేనే లేదు. వారికి లింగ సమానత్వం ఎలా కోరుతారు?"అంటూ వ్యాఖ్యలు చేశారు. మదరసాల్లోని ముస్లిం విద్యార్థులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఓ మహిళా జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ...ఆ వార్తలు నిరాధారమైనవన్నారు. ఇలాంటి ఆరోపణలు చేసేవారు ముందుగా ఆధారాలు తేవాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే పలు దేశాల్లో ముస్లింలకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే వారికి ఓటు హక్కు కూడా లేదు. ప్రపంచం అంతా సమానత్వం దిశగా సాగుతుంటూ... అస్సలు ఆ ప్రతిపాదనే సహేతుకం కాదని ముస్లిం నాయకుడు చెప్పడం విశేషమే. దీనిపై ప్రజాస్వామ్యవాదులు, మహిళాపక్షపాత వాదులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.