Begin typing your search above and press return to search.
అత్యాచార నిందితుడికి బీజేపీ రాచమర్యాదలు...!
By: Tupaki Desk | 29 Sep 2019 6:46 AM GMTనీతి నియమం.. క్రమశిక్షణ అని నీతులు వల్లించే బీజేపీ ఇప్పుడు ఓ బాలికను అత్యాచారం చేసిన ఓ రాజకీయ నాయకుడికి అండగా నిలిచి నీతి నియమాలకు పాతరేసింది. నీతులు మీకు చెప్పడానికే కానీ మేము పాటించడానికి కాదని బీజేపీ కూడా నిరూపించింది. అందుకు ఈ కేసే ఓ ఉదహారణ... 23 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసిన ఈ ప్రబుద్దుడికి అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేర్పించి ఆస్పత్రినే గెస్ట్ హౌస్ గా చేసి అధికార లాంచనాలతో రాచమర్యాదలు చేస్తున్న వైనం ఇది. అంతే కాదు ఎంపీ చేత అత్యాచారానికి గురైన అమ్మాయిని మాత్రం జైల్లో నిర్భందించారు.. ఇదేమి చిత్రమో తెలియదు కానీ బీజేపీ పాలనంతా ఇట్లాగే ఉంది.
ఇది ఎక్కడో జరుగుతున్న తంతు కూడా కాదు.. ఇది స్వయానా ఓ బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. ఆ రాష్ట్రాన్ని ఏలుతుంది యోగి. అసలు విషయానికి వస్తే.. బీజేపీ ఎంపీ - కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ 23 ఏళ్ల ఓ లా విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దీనిపై ఆ అమ్మాయి ఎంపీపై పోలీసుకు పిర్యాదు చేసింది. ఆయనపై రేప్ అభియోగాలను దాఖలు చేయాల్సిన యూపీ పోలీసులు, సెక్సువల్ అసాల్ట్ అభియోగాలను దాఖలు చేశారు. దీంతో ఆపోలీసులు ఎంపీని అరెస్ట్ చేశారు. కానీ అతడు బీజేపీకి చెందిన ఎంపీ, కేంద్రమాజీ మంత్రి కావడంతో బీజేపీ సర్కారు చిన్మయానంద్‌ను అధికార లాంచనాలతో రాచమర్యాదలు చేస్తుందట.
అయితే అసలే అత్యాచారంతో కుంగిపోయిన ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన పోలీసులు, న్యాయవాదులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. అమ్మాయి ఎంపీ చిన్మయానంద్ దగ్గర డబ్బులు లాగేందుకు తప్పుడు కేసు పెట్టిందని ఆరోపిస్తూ అమ్మాయిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతిగా స్పందించి అమ్మాయిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన ఎంపీ చిన్మయానంద్ మాత్రం పోలీసుల అండ, సర్కారు తోడుగా నిలవడంతో అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరి రాచమర్యాదు అందుకుంటున్నాడు. అయితే యూపీ సర్కారు ఈ కేసుపై ఓ విచారణ కమిటీని కూడా నియమించింది.
ఆ కమిటీ కూడా చిన్మయానంద్ ను దోషిగానే గుర్తించిందట. చిన్మయానంద్ రేప్ కేసులో నేరం రుజువైతే దోషికి ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడుతుంది. అదే సెక్సువల్ అసాల్ట్ కేసులో అయితే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇది పోలీసులు చిన్మయానంద్ కు చేసిన మేలుగానే తెలుస్తుంది. ఏదేమైనా బీజేపీ సర్కారు బాధితులను జైల్లో.. నిందితులకు రాచమర్యాద చేయడంలో ముందుంది.. సో నీతులు చెప్పే బీజేపీ కూడా నీతులకు గోతులు తవ్వుతుందని నిరూపించింది.