Begin typing your search above and press return to search.
అనంతపురం ఎమ్మెర్వో ఆఫీస్ పై ఏసీబీ దాడి...బుక్కైన ఆర్‌ఐ !
By: Tupaki Desk | 25 Jun 2020 12:30 AM GMTమంచి ఉద్యోగం ..మంచి జీతం వస్తున్నా కూడా కొంతమంది ప్రభుత్వాధికారులు అడ్డదారిలో వచ్చే డబ్బుల కోసం తహతహలాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే లంచం ఇస్తే తప్ప పని చేయరు అన్న దుస్థితికి వచ్చింది ప్రస్తుత పరిస్థితి. వచ్చే జీతంతో హాయిగా జీవించకుండా ..లంచం తీసుకోని అడ్డంగా బుక్కై ..సమాజంలో పరువు, మర్యాద కోల్పోయి , ఊచలు లెక్కపెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రతి రోజు ఎంతోమంది లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నా కూడా లంచం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోతుండటం గమనార్హం.
తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాసుపుస్తకం కోసం రైతు నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అడ్డంగా బుక్కయ్యాడు. నంబులపూలకుంట పరిధిలోని తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం రైతు కొండారెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. అదే విషయమై ఆర్ ఐ మురళీధర్ ని కలిశాడు.
పాసు పుస్తకం ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనని.. లేకుంటే పని జరగదని ఆర్ ఐ తేల్చిచెప్పడంతో కొండారెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేక ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ మురళీధర్ కి లంచం ఇస్తుండగా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఏసీబీ అధికారుల రాకను చూసి రెవెన్యూ అధికారి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు.