Begin typing your search above and press return to search.

ఆదాయానికి మించి ఆస్తులు.. కోర్టు కు దొరికిన బాబు !?

By:  Tupaki Desk   |   19 Nov 2019 4:40 AM GMT
ఆదాయానికి మించి ఆస్తులు.. కోర్టు కు దొరికిన బాబు !?
X
"దాదాపు 40 ఇయర్స్ పాలిటిక్స్ ఆయన.. ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసు. ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలుసు.. అందుకే ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో రెండు ఎకరాల ఆసామీ రెండు వేల కోట్ల అధిపతిగా మారినా కోర్టులకు చిక్కలేదు.. దొరకలేదు. మీడియా మేనేజ్ మెంట్ లోనే కాదు.. అన్ని రంగాల్లోనూ మేనేజ్ చేయగల సత్తా మన టీడీపీ అధినేత చంద్రబాబు సొంతం" అని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అయితే అన్నివేళలా అదృష్టం ఒకవైపే ఉండేదు. నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్టే.. న్యాయానికి రెండు వైపులా ఉంటాయని తేలింది.. ఎల్లప్పూడూ మన పనితనం పనికిరాదు.. కాలం మారింది.. చంద్రబాబు సైతం దొరికేశారని ఆయన ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు... తాజాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబు పీకల్లోతు ఇరుక్కున్నారు.

*2005లో కేసు.. ఇప్పుడు విచారణ
ఎప్పుడో 2005లో నమోదైన కేసులో స్టే తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు దొరికిపోయారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.. 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు తాజాగా అంగీకరించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

*సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దొరికిన చంద్రబాబు
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యం లోనే చంద్రబాబు దొరికిపోయారు. సివిల్ , క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు కారణంగా చంద్రబాబు ఎప్పుడో 2005లో తెచ్చుకున్న స్టే గడువు ఎప్పుడో ముగిసినట్టైంది. అయితే చంద్రబాబు తరుఫు న్యాయవాది మాత్రం తదుపరి ఉత్తర్వులు వెలువరించేత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు. అయితే లక్ష్మీపార్వతి లాయర్ మాత్రం స్టే అనేది సివిల్, క్రిమినల్ కేసుల్లో ఆరునెలలకు మించి ఉండదని సుప్రీం కోర్టు చెప్పిందని.. విచారణ జరపాలని కోరారు. చంద్రబాబుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత చంద్రబాబు స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని వాదించారు. దీంతో చంద్రబాబు పై విచారణకు ఏసీబీ కోర్టు అంగీకరించింది.

*చంద్రబాబుపై విచారణకు కోర్టు రెడీ
అప్పట్లో ఆదాయానికి మించిన కేసులో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే చంద్రబాబు స్టే గడువు ముగియడం.. స్టే విషయంలో హైకోర్టు ఎలాంటి పొడిగింపు ఇవ్వకపోవడంతో కేసు లో మళ్లీ విచారణ ప్రారంభిస్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారు అయిన లక్ష్మీ పార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది..

*చంద్రబాబు పై అక్రమాస్తుల కేసు నేపథ్యమిదీ
1996 నుంచి 2004 వరకు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా కొనసాగారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని.. దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీ పార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టు లో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దీని పై చంద్రబాబు హైకోర్టు లో రిట్ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ ను విచారించిన అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ 2005లో చంద్రబాబుపై విచారణను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు ఇచ్చారు. ఆ స్టే ఉత్తర్వులు ఎత్తి వేయాలని లక్ష్మీపార్వతి అనుబంధ పిటీషన్ వేసినా దానిని హైకోర్టు కొట్టి వేసింది. అప్పటి నుంచి ఈ కేసులో స్టే కొనసాగుతూ వస్తోంది.

*ఎట్టకేలకు చంద్రబాబు పై విచారణ
ఆరు నెలలకు మించి స్టేలు చెల్లవన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యం లోనే ఇక చంద్రబాబు పై స్టే లేనట్లేనని భావిస్తూ విచారణ కొనసాగింపునకు జడ్జి గోవర్ధన్ రెడ్డి తాజాగా నిర్ణయించారు. పిటీషన్ వేసిన లక్ష్మీపార్వతి హాజరుకు ఆదేశాలిచ్చి విచారణను వాయిదా వేశారు. అయితే అనూహ్యంగా కొద్దిరోజులకే జడ్జి గోవర్ధన్ రెడ్డి బదిలీ కావడం చర్చనీయాంశమైంది.