Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు చిక్కులు..టీడీపీ వర్గాల్లో ఉలికిపాటు!
By: Tupaki Desk | 19 Nov 2019 8:23 AM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఇంటాబయట చిక్కులు తప్పవని అంటున్నారు పరిశీలకులు. అక్రమాస్తుల వ్యవహారంలో పద్నాలుగు సంవత్సరాల కిందట చంద్రబాబుగారి అత్తగారు నందమూరి లక్ష్మిపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ఇన్నేళ్లూ స్టేలో ఉండటం - ఇప్పుడు ఆ వ్యవహారంపై విచారణకు కోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. అసలే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వాసంలో ఉన్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది ఇరవై మూడు సీట్లు మాత్రమే - అంతటి దారుణ పరాజయం తర్వాత పరిణామాలు అంతే కఠినంగా ఉంటున్నాయి చంద్రబాబు నాయుడుకు.
ఒకవైపు ఇంకా పార్టీ నాయకత్వ బాధ్యతలు అందుకోలేని స్థితిలో ఉన్నారు లోకేష్. అంతకు మించి అతడు తెలుగుదేశం పార్టీని వీడాలనుకునే వారికి వరంగా మారుతూ ఉన్నాడు. ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారు? అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
ఇప్పటికే ఒక రాజీనామా చోటు చేసుకుంది. మరి కొందరు బీజేపీకి టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతూ ఉంది. త్వరలోనే చంద్రబాబుకు కనీస ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుందనే స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఉన్నట్టుండి ఉరుము లేని పిడుగులా పాత కేసు పై స్టే తొలగిపోయింది. అది కూడా ఈ నెలలోనే విచారణ మొదలుకానుందట!
ఇన్నాళ్లూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు రకరకాలుగా విమర్శిస్తూ వచ్చారు. ఆయన కోర్టు వెళ్తారని - జైలుకు వెళ్తారని అంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేయాల్సి వస్తే.. జగన్ మీద విమర్శించడానికి టీడీపీకి ఉన్న ఏకైక ఆయుధం కూడా పోయినట్టే!
అంతకు మించి.. పాత కేసులో స్టే తొలగింపు వ్యవహారంతో తెలుగుదేశం వర్గాలు ఉలికిపడుతూ ఉన్నాయి. అందుకు నిదర్శనం ఆ వార్తను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తక్కువ చేసి చూపుతూ ఉండటం. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పేరు పొందిన రెండు ప్రధాన వార్తా పత్రికలూ ఆ వార్తను కనీసం కవర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు.
ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత - అది కూడా పద్నాలుగు సంవత్సరాలు ఏలిన మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తులపై విచారణ అంటే చిన్న విషయం కాదు. అలాంటి అంశాన్ని ఫస్ట్ పేజీ లో వేయవచ్చు. కానీ టీడీపీ అనుకూల మీడియా దాన్ని దాచేసింది. ఆ దాపరికమే తెలుగుదేశం పార్టీలో ఉలికి పాటును చాటుతూ ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైందని - చంద్రబాబుకు ముందుంది ముసళ్ల పండగ.. అనే టాక్ కూడా వినిపిస్తోందిప్పుడు!