Begin typing your search above and press return to search.

ఏపీ అవినీతి అధికారి ఆస్తి జ‌స్ట్ రూ.900 కోట్లు

By:  Tupaki Desk   |   24 Jun 2017 4:10 AM GMT
ఏపీ అవినీతి అధికారి ఆస్తి జ‌స్ట్ రూ.900 కోట్లు
X
అవినీతి ప్ర‌భుత్వ ఉద్యోగిపై ఏసీబీ రైడ్ అనే వార్త మ‌న‌కు తెలియ‌గానే స‌హ‌జంగా స‌ద‌రు `ప్ర‌జా సేవ‌కుడి` అక్ర‌మ సంపాద‌న ఓ కోటి ఉంటుంద‌ని అనుకుంటాం. ఒకవేళ దొరికింది ఉన్న‌త అధికారి అయిన లంచ‌గొండి అయితే మ‌హా అయితే ఓ ప‌దికోట్ల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద లంచాల రూపంలో, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌టం ద్వారా వెన‌కేసుకున్నాడ‌ని భావిస్తుంటాం. కానీ ఏపీలో ఓ అవినీతి బాహుబ‌లి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆయ‌న అక్ర‌మాస్తులు ఎంత‌నుకుంటున్నారు? ఊపిరి బిగ‌ప‌ట్టి చ‌ద‌వండి. రూ.900 కోట్లు.

ఒక ప్ర‌భుత్వ అధికారి రూ.తొమ్మిది వందల కోట్లు సంపాదించాడా? ఈ రేంజ్‌ లో అవినీతి చేశాడంటే ఆయ‌న చాలా... అనుకునే మీ అభిప్రాయం నిజ్జంగా నిజమే! ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో చెప్ప‌లేదు కదా? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రజారోగ్యశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ పాము పాండురంగారావు. ఈయ‌న గారి అవినీతి బాగోతం బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత‌....ఇంటిపేరును కామెంట్ చేయ‌డం కాదు కానీ నిజంగానే అనకొండ‌లాగా అవినీతి చేశాడ‌ని ప‌లువురు నెటిజ‌న్లు ఎద్దేవా చేస్తున్నారు. సారుగారి అక్ర‌మాస్తుల‌కు మార్కెట్ విలువ క‌డితే రూ.900 కోట్లు అవుతాయ‌ని ఏసీబీ అధికారులు లెక్క‌లు వేశారు.

ఏపీ ఆరోగ్య ఇంజినీర్ ఇన్ చీఫ్ గారి హైద‌రాబాద్‌ లో కొన్న ఉన్న ఒక్క ఆస్తి చాలు ఆయ‌న రేంజ్ ఏంటో చెప్పేయ‌డానికి. హైద‌రాబాద్‌ లో ఇల్లు - వాణిజ్య స్థ‌లం విలువ జ‌స్ట్ వంద కోట్లేన‌ట‌. ఏసీబీ అధికారులు చెప్పిన ప్ర‌కారం ఇక మిగ‌తా వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఉభయ గోదావరి - కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల పొలం - విశాఖ అశ్వని ఆస్పత్రిలో రూ.4 కోట్ల పెట్టుబడులు - సుధీర్‌ అండ్‌ సునీల్స్‌ సోలార్ పవర్‌ ప్లాంట్‌ లో రూ. 66 లక్షల పెట్టుబడి, రూ. 9 లక్షల నగదు - బ్యాంక్‌ ఖాతాలో రూ.పది లక్షలు - కేజీన్నర బంగారు నగలు - 9 కిలోల వెండి - రైటన్‌ సాఫ్ట్‌ వేర్‌ - హెచ్‌ ఎంటెక్నాలజీలో భార్య - కొడుకు పేరుతో పెట్టుబడులు - ప.గో జిల్లాలో ఆరు కోట్ల విలువైన ఆస్తులు - కృష్ణా జిల్లాలో ఇళ్లు - విజయనగరంలో మ‌రో ఇల్లు - గుంటూరులో 8 ఇల్లులు - హైదరాబాద్‌ లో ఏడు స్థలాలు....ఇవి సార్ `చెమ‌టోడ్చి` సంపాదించిన ఆస్తుల ప్రాథమిక వివ‌రాలు. మొత్తం లెక్క‌లు తేలితే పాము పాండురంగారావు గారు ప్రజారోగ్యశాఖ‌లో చేసిన `సేవ‌`పై క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/