Begin typing your search above and press return to search.

గ్రేటర్ అధికారి ఇంట్లో రూ.20 కోట్లా..?

By:  Tupaki Desk   |   5 Aug 2016 8:19 AM GMT
గ్రేటర్ అధికారి ఇంట్లో రూ.20 కోట్లా..?
X
ఒక టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి ఏ స్థాయిలో ఉంటుంది? అన్న ప్రశ్న వేస్తే.. కోటిరూపాయిలో.. రెండు కోట్లో ఉంటుందని చెబుతారు.కానీ.. తాజాగా ఏసీబీ అధికారులకు చిక్కిన ఒక అధికారి ఉదంతం వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. హైదరాబాద్ లోని జీహెచ్ ఎంసీకి చెందిన టౌన్ ప్లానింగ్ అధికారిక సంతోష్ వేణు ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న ఆరోపణల మీద ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారు.

హైదరాబాద్ సిటీలో ఆయనకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై ఏకకాలంగా అధికారులు దాడులు నిర్వహించి.. ఆయన ఆస్తుల్ని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ సర్కిల్ 10లో సిటీ ప్లానింగ్ ఆఫీసర్ గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆస్తుల్ని అంచనా వేస్తున్న అధికారులు అవాక్కు అవుతున్న పరిస్థితి. ఇప్పటికి ఆయనకున్న ఆస్తుల విలువ రూ.20కోట్లుగా అంచనా వేయటం సంచలనంగా మారింది

సంతోష్ వేణు ఎక్కడ పని చేస్తే అక్కడ ఆరోపణలు కామన్ అని చెబుతున్నారు. గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. సిటీ ప్లానింగ్ శాఖలో ఒక సాదాసీదా అధికారి ఆస్తులు ప్రాధమికంగానే రూ.20కోట్లు ఉంటే.. మొత్తం లెక్క తేలిస్తే ఇంకెంత అవుతుందన్నది ఇప్పుడు చర్చగా మారింది. అవినీతి అధికారుల భరతం పడతామని చెప్పే తెలంగాణ ప్రభుత్వం.. తాజా అధికారి అవినీతి చిట్టాకు ఏం సమాధానం చెబుతుందో..?