Begin typing your search above and press return to search.
రేవంత్ ఇంట్లో ఏం దొరికాయి?
By: Tupaki Desk | 9 Jun 2015 7:17 AM GMTఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినీతి నిరోధక విభాగం అధికారులు మంగళవారం ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు ఐదు గంటలుగా సోదాలు జరుగుతుండటం విశేషం. రేవంత్ ఇంటితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ సింహాల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
రేవంత్ ఇంట్లో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా అధికారులు చెప్పారు. అంత కీలకంగా అనిపించే పత్రాలు ఏవై ఉంటాయన్నది ఆసక్తికరం. అయినా రేవంత్ అరెస్టయిన వారం రోజులకు అధికారులిలా సోదాలు నిర్వహించడం ఆశ్చర్యం కలిగించే విషయం. సోదాలు అవసరమనుకుంటే వెంటనే చేస్తే ఏమైనా ఆధారాలు దొరికి ఉండొచ్చేయో. వారం తర్వాత సోదాలు చేసి.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పడం చూస్తుంటే..కేసు సీరియస్‌గా సాగుతోందని సంకేతాలివ్వడానికే అని భావించాలి. తెలుగుదేశం శ్రేణుల్ని, చంద్రబాబును కంగారు పెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్లో భాగమే ఈ సోదాలని అనుకోవాలేమో.