Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రికి ..టీ ఏసీబీ నోటీసులా..?
By: Tupaki Desk | 19 Aug 2015 5:38 AM GMTరెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు రెండు రాష్ర్టాల పోలీసుల ఎత్తులు, పై ఎత్తులతో ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికి తెలియడం లేదు. నిన్నటికి నిన్న ఈ కేసులో తెలంగాణ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో చంద్రబాబు పేరు ప్రస్తావనకు రావడం...ఇటు ఏపీ సీఐడీ పోలీసులు కేటీఆర్ గన్ మెన్, డ్రైవర్ల అరెస్టుకు వారెంట్ జారీ చేయడంతో కాస్త ఈ కేసు రసవత్తరంగా మారింది.
తాజాగా వినపడుతున్న సమాచారం ప్రకారం ఇదే కేసులో తెలంగాణ ఏసీబీ ఏపీ మంత్రి ఒకరికి, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యే లకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసిందట. అలాగే మరో ఇద్దరు పోలీసు అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం ముత్తయ్యకు వీరు చేసిన సాయం గురించి తెలంగాణ ఏసీబీ వద్ద కొన్ని కీలక ఆధారాలు ఉన్నట్టు టాక్.
ఈ విషయాలన్నింటిని మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ తో ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఆయనకు వివరించినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలతోపాటు భవిష్యత్ కార్యాచరణను సీఎంకు ఖాన్ వివరించినట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రితో పాటు ఎమ్మెల్యే లకు నోటీసులు ఇచ్చే విషయంలో ఎలా వ్యవహరించాలనేదానిపై కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. అలాగే టీడీపీ యువనేత లోకేష్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డి విచారణకు రాని నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇవ్వవచ్చని కూడా భావిస్తున్నారు.
ఇంతకు ఇప్పుడు టీ ఏసీబీ నోటీసులు జారీ చేసే ఆ ఏపీ మంత్రి, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యే లు ఎవరన్నది పొలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాజధానికి సమీపంలో ఉండే జిల్లాలకు చెందిన ఓ మంత్రి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న వాదనే నిజమైన పక్షంలో రానున్న కొద్ది రోజుల్లో.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే వీలుందని చెబుతున్నారు.