Begin typing your search above and press return to search.
''బాస్'' ఎవరో తేల్చేశారా..?
By: Tupaki Desk | 10 Jun 2015 5:16 AM GMTఓటుకు నోటు వ్యవహారంలో కెమేరా కళ్లకు చిక్కిన రేవంత్ రెడ్డిని విచారిస్తున్న ఏసీబీ కీలక సమాచారం తాము సేకరిస్తున్నట్లు చెబుతోంది. ఎక్కువ మాట్లాడితే ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్వరంతో విరుచుకుపడిన ఒకరోజు తర్వాత.. బాస్ ఎవరో తెలిపోయినట్లుగా ఏసీబీ అధికారులు వ్యాఖ్యలు చేయటం విశేషం.
ఓట్లకు నోటు వ్యవహారం మొదట రేవంత్‌రెడ్డి కేంద్రంగా సాగినప్పటికీ.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సందర్భంలో రేవంత్‌రెడ్డి ప్రస్తావించిన బాస్ మాటపై అధికారులు దృష్టి సారించారు.
ఆయన నోటి నుంచి వచ్చిన బాస్ ఎవరు? అన్న అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టటమే కాదు.. దానికి సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని తాము సేకరించినట్లుగా చెబుతున్నారు. బాస్ ఎవరన్నది తేలిపోయిందని.. రేవంత్‌రెడ్డి వీడియోసాక్ష్యం కంటే కూడా ఈ కేసుకు సంబంధించి మరిన్ని పక్కా ఆధారాలు లభించినట్లుగా చెబుతున్నారు.
ఈ కేసు మొత్తంలో అత్యంత ముఖ్యమైన బాస్ అంశాన్ని ఏసీబీ అధికారులు తేల్చినట్లుగా చెబుతున్న అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో చేర్చే దిశగా అడుగులు పడుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. బాబు పేరును నమోదు చేసి.. నోటీసులు ఇచ్చే అంకంలో భాగంగానే బాస్ ఎవరో తేల్చినట్లుగా ఏసీబీ అధికారులు ప్రకటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ వద్ద ఉన్న ఆధారాలతోనే తాము చేస్తున్నామన్న భావన కల్పించటంతో పాటు.. బాబు పేరు చేర్చిన మరుక్షణం.. రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో ముందస్తుగా ఇలాంటి ప్రకటన చేసి ఉండొచ్చన్న భావన వ్యక్తమవుతోంది.