Begin typing your search above and press return to search.
ప్రమాదవశాత్తూ కేసీఆర్ ఫాంహౌస్ లో యువకుడి మృతి
By: Tupaki Desk | 23 Dec 2021 7:40 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో యువకుడు మృతిచెందడం కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పనికి వెళ్లిన యువకుడు మూర్ఛవ్యాధితో బావిలో పడి మృతిచెందడం విషాదం నింపింది.
వర్ధరాజ్ పూర్ కు చెందిన ఆర్. ఆంజనేయులు(19) అనే యువకుడు ఫాంహౌస్ లో కూలీ పనులు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం కొంతమంది కూలీలతో కలిసి ఫామ్ హౌస్ కు వచ్చాడు. పెద్దబావి పక్కన ముళ్లపొదలను తొలగిస్తుండగా.. మూర్ఛవ్యాధి రావడంతో అందులోకి జారిపడ్డాడు. పక్కనే ఉన్న కూలీలు పనిలో నిమగ్నమై అతడిని గమనించలేదు.
ఎంతకీ కనిపించకపోవడంతో బావిలో పడ్డాడని అనుమానించారు. సాయంత్రం గజ ఈతగాళ్లతో బావినీటిలో గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం మళ్లీ గజ ఈతగాళ్లు బావిలో గాలింపుచర్యలు చేపట్టగా.. ఆంజనేయులు మృతదేహం లభించింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
తండ్రి కృష్ణయ్య ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్టు మార్కూక్ పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.