Begin typing your search above and press return to search.

35 ముక్క‌లు చేసినందుకు ఏ బాధా లేదు

By:  Tupaki Desk   |   30 Nov 2022 11:31 AM GMT
35 ముక్క‌లు చేసినందుకు ఏ బాధా లేదు
X
ఢిల్లీలో 35 ముక్క‌లుగా న‌రికేసి శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు పాల్ప‌డిన ఆప్తాబ్‌.. ఈ కేసులో త‌న‌కు ఎలాంటి విచారం.. బాధ లేద‌ని వెల్ల‌డించి.. మ‌రో సంచ‌ల‌నానికి దారితీశాడు. ఈ కేసును డిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్తాబ్‌కి పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో అఫ్తాబ్‌ చెప్పిన మాటలు అతడి క్రూర మనస్థత్వాన్ని మరోమారు బయటపెట్టాయి.

శ్రద్ధాను చంపినట్లు అంగీకరించిన నిందితుడు ఆఫ్తాబ్‌.. అందుకు తనకేమి బాధలేదని పేర్కొన్నారు. తనకు ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని అఫ్తాబ్‌ ఒప్పుకున్నట్లు దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో అఫ్తాబ్‌కు నార్కోటిక్‌ పరీక్ష చేసే అవకాశముందని దర్యాప్తు అధికారులు తెలిపారు.

ఢిల్లీలో సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాకు ఇటీవల పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. పాలిగ్రాఫ్‌ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని అంగీకరించిన అఫ్తాబ్.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని, బాధ పడటం లేదని చెప్పినట్లు దర్యాప్తు బృందం వర్గాలు వెల్లడించాయి.

హత్య తర్వాత శ్రద్ధాను ముక్కలు చేసి ఆమె శరీర భాగాలను అడవిలో పడేసిన విషయాన్ని కూడా అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని నిందితుడు అంగీకరించినట్లు సదరు వర్గాలు చెప్పాయి.

పాలిగ్రాఫ్‌ పరీక్షల సమయంలో అఫ్తాబ్ ప్రవర్తన చాలా సాధారణంగా ఉన్నట్లు తెలిపాయి. శ్రద్ధా హత్యకు సంబంధించిన అన్ని వివరాలను ఇప్పటికే పోలీసులకు చెప్పానని నిందితుడు పదేపదే చెప్పినట్లు సమాచారం.

అఫ్తాబ్ పాలిగ్రాఫ్‌ పరీక్షకు సంబంధించి తుది నివేదిక రానప్పటికీ అతడికి నార్కో పరీక్ష జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో ఢిల్లీలోని రోహిణి ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అఫ్తాబ్‌ ఇచ్చే సమాచారం కేసు దర్యాప్తునకు కీలకంగా మారుతుందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.