Begin typing your search above and press return to search.
శ్రద్ధ హత్య వెనుక లవ్ జిహాద్.? ఆన్ లైన్ లావాదేవీలే పట్టించాయి?
By: Tupaki Desk | 16 Nov 2022 3:30 PM GMTదేశమంతా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. తనను నమ్మి వచ్చిన ప్రియురాలిని చంపి 35 ముక్కలుగా కోసి ఢిల్లీలోనిపలు ప్రాంతాల్లో విసిరి అత్యంత కిరాతకంగా చంపిన అఫ్తాబ్ పూనావాలా(28)ను విచారిస్తున్న పోలీసులు అతడి క్రూరత్వాలు తెలిసి షాక్ అవుతున్నారు. కీలక ఆధారాలు రాబడుతున్నారు.
శ్రద్ధాకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో ఈనెల 8న ఆమె తండ్రి ఢిల్లీలో వారు ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లి చూశాడు. శ్రద్ధను అమీన్ తరుచూ కొడుతూ వేధించేవాడని.. రెండు నెలలుగా తమకు కనిపించడం లేదని.. కాంటాక్టులోనూ లేడని స్నేహితులు చెప్పడంతో శ్రద్ధ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో పోలీసులు అక్టోబర్ 28, నవంబర్ 3 వరకూ పలుమార్లు అమీన్ ను పిలిచి విచారించారు. తామిద్దరికీ గొడవ జరగడంతో శ్రద్ధ ఇల్లు విడిచి ఫోన్ పట్టుకొని వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి కాంటాక్టులో లేదని అమీన్ తొలుత బుకాయించాడు.
అయితే పోలీసులు శ్రద్ధ ఫోన్ నుంచి అమీన్ జరిపిన ఆన్ లైన్ లావాదేవీలు, ఆమె బతికే ఉన్నట్టు స్నేహితులను నమ్మించేందుకు ఆమె ఫోన్ లోని సోషల్ మీడియా ద్వారా చేసిన చాటింగ్ లను గుర్తించారు. ఆమె ప్లేసులో అమీన్ ఈ లావాదేవీలు చేసినట్టు సీసీటీవీ ద్వారా గుర్తించారు. ఆన్ లైన్ లావాదేవీలే అమీన్ ను పట్టించాయి. కేసు ఛేదనలో పోలీసులకు కీలకంగా మారాయి. మే 26న శ్రద్ధ ఖాతా నుంచి బ్యాంకింగ్ యాప్ ద్వారా అమీన్ కు రూ.54వేలు ట్రాన్స్ ఫర్ అయినట్టు గుర్తించారు. లోకేషన్ మెహ్ రౌలీలోని వారు అద్దెకు ఉన్న ఫ్లాట్ నే చూపించింది. దీంతో శ్రద్ధ ఇల్లు విడిచిపోతే అమీన్ ఫ్లాట్ లో ఆన్ లైన్ డబ్బులు ట్రాన్స్ ఫర్ కావడంతో ఇది చేసింది అమీన్ అనిపోలీసులు గుర్తించారు. అమీన్ మాటలకు చేష్టలకు పొంతన కుదరకపోవడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయాలను అమీన్ బయటపెట్టాడు.
తరచూ పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ వేధించడంతో ఆమెను చంపి 35 ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో దాచినట్టు వెల్లడించాడు. రోజూ రాత్రి 2 గంటల సమయంలో తన ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లి ఆమె శరీర భాగాలను ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విసిరేసినట్టు బయటపెట్టాడు. ఈ ఘటన దేశమంతా దుమారం రేపింది.
శ్రద్ధను చంపినా అమీన్ లో పశ్చాత్తాపం కనిపించలేదట.. నిందితుడు అమీన్ ఒక మతానికి చెందిన వాడని.. లవ్ జిహాదీ అని.. శ్రద్ధాను మతం మారాలని తరచూ వేధించేవాడని.. మారకపోవడంతోనే హత్య చేశాడని ఆమె స్నేహితులు సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ లవ్ జిహాదీ ఆరోపణలు ఈ కేసులో సంచలనంగా మారాయి. ఈ హత్యోదంతంలో కొత్త కోణం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.