Begin typing your search above and press return to search.
వైరల్ వీడియోపై స్పందించిన అచ్చెన్నాయుడు
By: Tupaki Desk | 13 April 2021 4:06 PM GMTతిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అచ్చెన్నాయుడుకు సంబంధించిన ఓ వీడియోను వైసీపీ నేత లీక్ చేసి పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. అచ్చెన్నాయుడు టీడీపీని, లోకేష్ ను , పార్టీపై సంచలన కామెంట్లు చేసినట్టుగా ఆ వీడియోలో ఉన్నట్టు ప్రచారమవుతోంది.
ఈ లీక్ వీడియోపై తాజాగా అచ్చెన్నాయుడు స్పందించారు. ఇది సీఎం జగన్ విష పన్నాగం అని అభివర్ణించారు. వీడియోను రికార్డ్ చేసిన అదృశ్యవ్యక్తి ఎవరనేది స్పష్టం చేయకుండానే సదురు సంభాషణలను వక్రీకరించారని అచ్చెన్నాయుడు వాపోయారు. తిరుపతి ఎన్నికల సభలో చంద్రబాబుపై రాళ్లు వేయించిన వైసీపీ నేతలే.. ఇవాళ తన సంభాషణలను వక్రీకరించారని అచ్చెన్న మండిపడ్డారు.
తిరుపతిలో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దిగజారుడు కార్యక్రమాలకు పూనుకున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇది ఏపీ సీఎం జగన్, వైసీపీ కుట్రగా అభివర్ణించారు. ‘జగన్ రెడ్డి.. నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేరు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుందని అచ్చెన్నా ఆరోపించారు.
నారా లోకేష్ విసిరిన సవాల్ కు తోకముడిచావ్ అని.. నిన్న బాబు గారి సభపై రాళ్లు వేయించావని.. ఈరోజు నా సంభాషణల్ని వక్రీకరించావని.. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవు అని అచ్చెన్న అన్నట్టు వీడియో ఉంది. నారాలోకేష్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.