Begin typing your search above and press return to search.
అచ్చెన్న.... మళ్ళీ చంద్రబాబు మీద... ?
By: Tupaki Desk | 30 Dec 2021 12:30 AM GMTఅచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. పైగా బీసీ నేత. ఓటమి ఎరగని వీరుడు. ఉత్తరాంధ్రా పార్టీకి గుండె కాయ లాంటి నాయకుడు. ఆయన సోదరుడు ఎర్రన్నాయుడు టైమ్ నుంచి కూడా టీడీపీకి బలమైన పొలిటికల్ ఫ్యామిలీగా ఉన్నారు. అలాంటి అచ్చెన్నాయుడు ప్రెసిడెంట్ అయ్యాక ఎంతో కాస్తా దూకుడు చూపిస్తున్నారు. ఆ మధ్యన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ ఒక హొటల్ లో పార్టీ లేదు, బొక్కా లేదు అంటూ హాట్ హాట్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వీడియోలు తెగ తిరిగాయి. దాని మీద అచ్చెన్నాయుడు ఖండించినా అధినాయకత్వం మాత్రం గుర్రుగానే ఉంది.
ఇక నాటి నుంచి పార్టీలో అచ్చెన్న హవా తగ్గిందని, ఆయనను కాస్తా దూరం పెట్టారని ప్రచారం అయితే ఉంది. ఇవన్నీ ఇలా ఉండగానే అచ్చెన్నాయుడు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి మీద కామెంట్స్ చేసినట్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. విశాఖలో తాజాగా జరిగిన విద్యుత్ ఉద్యోగుల క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అచ్చెన్న మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు.
వచ్చేది తమ ప్రభుత్వమే, చంద్రబాబే ఆరు నూరు అయినా సీఎం అయి అచ్చెన్న చెబుతూనే బాబు వైఖరి మీద కొన్ని కామెంట్స్ చేశారని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు బాబు చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది ఒకటి అన్నట్లుగా అచ్చెన్నాయుడు కామెంట్స్ చేశారని టాక్. అంటే అధికారం కోసం బాబు హామీలు ఇచ్చినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ బిజీలో ఇవన్నీ మరచిపోతారని అచ్చెన్న అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
అయితే తాము ఈసారి బాబు వెంటపడి అయినా అందరి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని అచ్చెన్నాయుడు విద్యుత్ ఉద్యోగ యూనియన్ నేతలతో అన్నట్లుగా భోగట్టా. అయితే అచ్చెన్న చెప్పింది సమంజసమే అని అందులో తప్పులేదని అనే వారూ టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు సీఎం గా ఉంటే అధికారులనే చుట్టూ తిప్పుకుంటారు. అపుడు ఆయనకు ఎవరూ కనబడరని విమర్శలు ఎటూ ఉన్నాయి. అదే అచ్చెన్న కూడా చెప్పారని అంటున్నారు. మొత్తానికి అచ్చెన్న కావాలని అనకపోయినా పార్టీ మంచికే చేసిన ఈ కామెంట్స్ మాత్రం ఆయన వ్యతిరేకులకు ఆయుధంగా మారే చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో అచ్చెన్న మరో మారు ట్రబుల్స్ ఫేస్ చేస్తారా అన్న చర్చ అయితే ఉంది. మరి చూడాలి దీని ఫలితం ఎలా ఉంటుందో.