Begin typing your search above and press return to search.

అచ్చెన్న వాడు...తున్న భాష...తమ్ముళ్ళ గుస్సా... ?

By:  Tupaki Desk   |   27 Feb 2022 12:30 AM GMT
అచ్చెన్న  వాడు...తున్న భాష...తమ్ముళ్ళ గుస్సా... ?
X
ఆయన మంచి లీడర్. అంతే కాదు, అన్న ఎర్రన్నాయుడు మాదిరిగానే డైనమిక్ లీడర్. ఒక సబ్జెక్ట్ మీద మాస్ ని అట్రాక్ట్ చేయాలంటే కూడా ఆయనకే చెల్లు. ఆయనే శ్రీకాకులం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన నోటి ధాటికి విపక్షాలు సైతం షాక్ అవుతాయి. అందుకే ఆ క్వాలిఫికేషన్ని మెచ్చుకుని టీడీపీ అధినాయకత్వం ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చింది. అయితే ఆ పదవి వచ్చిన తరువాతనే అచ్చెన్న గ్రాఫ్ పెరగాల్సింది తగ్గుతోంది అని అంటున్నారు.

అచ్చెన్నాయుడు విపక్షాల మీద పెద్ద నోరు చేస్తారు. అంతవరకూ బాగానే ఉన్నా సొంత వారి మీద కూడా ఆయన నోరు చేయడాన్నే తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆయన మరి అభిమానంతో అంటున్నారో లేక మరో విధంగా అంటున్నారో తెలియదు కానీ ఎంతటి నాయకుడు అయినా వాడూ వీడూ అని సంభోదించడం మాత్రం తట్టుకోలేకపోతున్నారు. లేటెస్ట్ గా అచ్చెన్నాయుడు ఒక సీనియర్ నేతను ఉద్దేశించి వాడు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

దాంతో ఆ నాయకుడే కాదు, సదరు సామాజికవర్గం కూడా మండిపడుతోంది. ఇంతకీ అచ్చెన్నా ఏమన్నారు, ఏమా సందర్భం అంటే చాలానే ఉంది. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయినా సొంత జిల్లాలోనే కొత్త చిక్కులు పెడుతున్నారు అన్న చర్చ కూడా ఉంది పాతపట్నం టీడీపీ నేత మామిడి గోవిందరావు విషయాన్ని అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణతో మాట్లాడుతూ వాడిని నీకు సాయంగా ఉండమనే ప్రోత్సహిస్తున్నా అంటూ ఏదేదో మాట్లాడారు.

ను పార్టీ ఆఫీస్‌లో ఉన్నాను.. వాడు(మామిడి గోవిందరావు) వచ్చి చంద్రబాబు నాయుడుకు ఒక చెక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అది తీసుకున్నాడు. చెక్కు కాదు వాడు ఆస్తి రాసి ఇమ్మను. పార్టీ వాడుకుంటుంది. మామిడి గోవిందరావుకు టిక్కెట్‌ ఆలోచన ఎందుకు. కలలో కూడా అది ఉహిస్తారా...’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తన స్వగ్రామమైన నిమ్మాడలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వాఖ్యలివి.

ఇపుడు ఇవే అతి పెద్ద వివాదం అవుతున్నాయి. ఒక పార్టీ నాయకుడిని పట్టుకుని ఇలా పబ్లిక్ గా విమర్శిస్తారా, వాడూ వీడూ అంటారా అని గోవిందరావు అనుచరులతో పాటు ఆ సామాజికవర్గం రగిలిపోతోంది. మరో వైపు చూస్తే గత ఏడాది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా కూడా లోకేష్ మీద ఏకవచన ప్రయోగం చేసి అచ్చెన్న హై కమాండ్ టార్గెట్ అయ్యారని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.

ఇలా నోరు చేసుకుని సొంత వారికే అవమానిస్తే అచ్చెన్న కు ఇబ్బందే కాదు, పార్టీకి కూడా దెబ్బే మరి అంటున్నారు. మొత్తానికి అచ్చెన్న వాడుతున్న భాష మాత్రం వాడూ వీడూ అంటూ ఎక్కడికో వెళ్ళిపోవడం పైన తమ్ముళ్ళు గుర్రు మీద ఉన్నారు.