Begin typing your search above and press return to search.

నిజమైన అచ్చెన్న ‘బొక్క జోస్యం’

By:  Tupaki Desk   |   20 April 2021 4:32 AM GMT
నిజమైన అచ్చెన్న ‘బొక్క జోస్యం’
X
17వ తేదీ ఉపఎన్నికైపోయిన తర్వాత ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యల వీడియో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అచ్చెన్న చెప్పినట్లే ఉపఎన్నిక పోలింగ్ అయిపోయింది. ఉపఎన్నికను రద్దుచేయాలని, కనీసం తిరుపతి అసెంబ్లీ వరకైనా రీపోలింగ్ జరగాలని చంద్రబాబునాయుడు, సోమువీర్రాజు డిమాండ్లు చేస్తున్నా ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు.

ఇలాంటి నేపధ్యంలోనే తాజాగా జరిగిన పోలింగ్ 64 శాతంగా నమోదైంది. 2019 ఎన్నికలో 80 శాతం జరిగిన పోలింగ్ తో పోల్చితే తాజాగా జరిగిన పోలింగ్ 16 శాతం తగ్గిపోయింది. తగ్గిన పోలింగ్ కారణంగా ప్రధానంగా టీడీపీకే బొక్కపడినట్లు అర్ధమవుతోంది. అంటే అచ్చెన్న చెప్పిన ఉపఎన్నికల పోలింగ్ లోనే టీడీపీకి 16 శాతం ఓట్లు బొక్కపడినట్లు అర్ధమైపోతోంది. అచ్చెన్న చెప్పిన ’బొక్కజోస్యం’ పోలింగ్ తోనే టీడీపీలో మొదలైందన్నమాట.

ఇక్కడే అచ్చెన్న వ్యాఖ్యలపై ఓ వాదన వినిపిస్తున్నది పార్టీలో. పోలింగ్ శాతం బాగా తగ్గిపోతుందని, ఆ తగ్గే ఓటింగ్ కారణంగా టీడీపీకి పెద్ద బొక్క పడబోతోందని అచ్చెన్నకు ముందే తెలుసు అన్నది ఆ వాదన. ఉపఎన్నికలో ప్రచారం కోసమని అచ్చెన్న దాదాపు 20 రోజులుగా తిరుపతిలోనే మకాం వేశారు. అన్నీ నియోజకవర్గాల్లో తిరిగారు. దీంతో క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితులు ఏమిటనే విషయం అచ్చెన్నకు స్పష్టంగా అర్ధమైపోయిందని నేతలంటున్నారు.

చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు సొంతజిల్లా. ఈ జిల్లాలోనే పార్టీ పరిస్ధితి ఇంత అద్వాన్నంగా ఉందన్న విషయం అర్ధమైన తర్వాతే పార్టీ లేదు బొక్కా లేదనే వ్యాఖ్యలను అచ్చెన్న చేసినట్లు చెబుతున్నారు. ఓటింగ్ 16 శాతం తగ్గటమంటే మామూలు విషయంకాదు. అదే 16 శాతం టీడీపీన కూడా పడుతుంది. అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ జరిగితే టీడీపీకి 4.94 లక్షల ఓట్లువచ్చాయి.

మరిపుడు జరిగిన 64 శాతం ఓటింగ్ లో 16 శాతం ఓట్లను టీడీపీకి తీసేస్తే సుమారు లక్ష ఓట్లదాక తగ్గిపోవాలి. అంటే జరిగిన 64 శాతం పోలింగ్ లో నికరంగా టీడీపీకి 16 శాతం తీసేయాలి. ఆ తర్వాత జరిగిన పోలింగ్ లో టీడీపీకి ఎంతపడిందనే లెక్కలు వేసుకోవాలి. ఇలా మొత్తం లెక్కలు చూసిన తర్వాత టీడీపీకి సుమారు 3 లక్షలకు మించి ఓట్లు రాదనేది ఓ అంచనా. మొత్తంమీద అచ్చెన్న బొక్కజోస్యం బాగానే ఫలించినట్లుంది.