Begin typing your search above and press return to search.

కాబోయే సీఎం : ఆయనేనని డిసైడ్ అయ్యారా...?

By:  Tupaki Desk   |   2 Aug 2022 10:34 AM GMT
కాబోయే సీఎం : ఆయనేనని డిసైడ్ అయ్యారా...?
X
ఏపీకి కాబోయే సీఎం ఎవరు... ఈ ప్రశ్న గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాను వెర్రెత్తిసోంది. రకరకాలైన స‌ర్వేలు అంటున్నారు. సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఏదేదో రాస్తున్నారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక ఏపీలో అధికారం మళ్ళీ తమదే అని వైసీపీ ఒక వైపు జబ్బలు చరుస్తోంది. మరో వైపు చూస్తే జనాలు ఈసారి టీడీపీనే ఎన్నుకుంటారు అని తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. ఇంతకీ ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు. అసలు వారు ఈ ముందస్తు ఊహాగానాలకు స్పందిస్తున్నారా. వారికి పార్టీలకు ఉన్న ఆతృత, రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా ఇవే ఇపుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 133 సీట్లు వస్తాయని ఒక సర్వే చెప్పింది. సో మేము అంతకంటే ఎక్కువ గెలుస్తామని వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. 150 సీట్ల పై దాకా మళ్ళీ వైసీపీవే అని కూడా ఆయన ఢంకా భజాయిస్తున్నారు. ఏపీలో వైసీపీ తప్ప మరో పార్టీ కూడా లేదని ఆయన నిబ్బరంగా చెబుతున్నారు.

ఇంకో వైపు చూస్తే టీడీపీకి చెందిన ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే జనాలు అపుడే కాబోయే సీఎం ని డిసైడ్ చేశారని అంటున్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని జనాలు కోరుకుంటున్నారు అని కూడా ఆయన చెబుతున్నారు. ఇక వైసీపీ పని అయిపోయిందని ఆ పార్టీ క్యాడరే చెబుతోందని, ఆ విషయంలో డౌటే లేదని కూడా సెటైర్లు వేశారు. అన్ని వర్గాలు, అన్ని రకాల ప్రజానీకం ఇపుడు ఏపీ అభివృద్ధి కోసం చూస్తోందని, చంద్రబాబు సీఎం కావాలని కూడా గట్టిగా ఆశిస్తోందని ఆయన చెప్పారు.

ఇలా కీలక నేతలు, రెండు పార్టీలకు చెందిన దిగ్గజాల మధ్యన మాదే గెలుపు అంటే మాదే అంటూ సాగుతున్న సంవాదం అలా ఉంచితే ఏపీ జనాలు అపుడే కాబోయే సీఎం ని డిసైడ్ చేశారా అంటే జవాబు కాదు అనే వస్తోంది ఒక్క ఏపీ అనే కాదు, దేశంలో కూడా 140 కోట్ల మంది జనాలకు తమ దైనందిన బాధలు, సమస్యలు ఉంటాయి. వారు నిత్య సంఘర్షణ పడుతూ ఉంటారు. అలాగే తమ బతుకులు గడుపుకునేందుకు లేస్తూ పడుతూ సాగుతూ ఉంటారు. అలాంటిది ఎపుడో ఇరవై నెలల తరువాత వచ్చే ఎన్నికల కోసం జనాలు ఎందుకు ఆరాటపడతారు.

మరి సర్వేలు, అభిప్రాయా సేకరణ అంటూ వస్తున్న వాటి సంగతేంటి అంటే అదంతా ట్రాష్ అనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రోజుకు కూడా ఏపీలో మెజారిటీ జనాలు ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేదు. వారికి అది చాలా అప్రధాన అంశంగా ఉందిపుడు. ఇక రాజకీయ నాయకుల టూర్లు వారి ప్రసంగాలు అన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు. తమ తీర్పు అనేది చెప్పడానికి చాలా టైమ్ ఉందని కూడా వారు తలపోస్తున్నారు.

ఎన్నికలకు మూడు నెలల ముందుగా కనిపించే అభిప్రాయమే గట్టిగా నిలబడుతుందని, అదే ప్రభుత్వాన్ని మారుస్తుందని అంటున్నారు. ఆ టైమ్ లో పవర్ లో ఉన్న వారు ఏం చేసినా కూడా జనాలు మరి వెనక్కి తిరిగేది లేదని కూడా అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జనాల పేరు చెప్పి నాయకులు చేస్తున్న సర్వేల విన్యాసాల్లో నిజాయతీ ఎంత ఉంది అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. జనాలు ఈ రోజు ఎవరు గొట్టం ముందు పెట్టి చెప్పమన్నా తమకు తోచిన మాట చెబుతారు. దాన్ని బట్టి కూడికలు తీసివేతలు వేసుకుంటే బొక్క బోర్లా పడడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఏపీకి కాబోయే సీఎం ఎవరు అంటే 2024 ఎంటరయ్యాకే ఒక కచ్చితమైన అభిప్రాయం జనాల నుంచి వస్తుందని అంటున్నారు.