Begin typing your search above and press return to search.
అచ్చెన్నకు ఫోన్ చేయాలంటే... ?
By: Tupaki Desk | 2 Feb 2022 11:30 PM GMTకింజరాపు అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ లీడర్, బీసీ వర్గానికి చెందిన నేత. ఇంకా చెప్పాలంటే ఆయనది పాతికేళ్ల రాజకీయం. ప్రస్తుతం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాంటి అచ్చెన్నాయుడు ఈ మధ్య ఎక్కడా పెద్దగా సౌండ్ చేయడం లేదు అని తమ్ముళ్ళు గుసగుసలు పోతున్నారు. ఆయన ఇదివరకు మాదిరిగా మీడియా ముందుకు రావడం లేదని కూడా అంటున్నారు. ఇక అచ్చెన్నాయుడు ఉన్న చోట నుంచే జగన్ కి లేఖలు రాస్తూ వైసీపీ సర్కార్ ని విమర్శిస్తూ తన పదవికి అలా న్యాయం చేస్తున్నారు అనే కామెంట్స్ పడుతున్నారు.
నిజానికి అచ్చెన్నాయుడు ఉండాల్సింది మంగళగిరి ఆఫీసులో. అక్కడ ఆయన కోసం ఒక చాంబర్ వెయిట్ చేస్తోంది. అయితే అచ్చెన్న మాత్రం ఎందుకో అక్కడ హల్ చల్ చేయడమే లేదు, అలాగే తీరు చూస్తే పూర్తిగా డల్ అయ్యారని చెబుతున్నారు. దానికి కారణం అధినాయకత్వంతో తెలియని గ్యాప్ ఏర్పడింది అని కూడా డౌట్లు పడుతున్నారు. పార్టీ లేదూ బొక్కా లేదు అని ఏ ముహూర్తాన అచ్చెన్నాయుడు అన్నారో లేక అలా అన్న వీడియో ఎలా లీక్ అయిందో తెలియదు కానీ నాటి నుంచే అచ్చెన్నకు కష్టాలు వచ్చేశాయని అంటున్నారు.
ఒక విధంగా ఇది చాలా పెద్ద మాట. ఒక పార్టీ అధినాయకత్వం వెన్నులో చలి పుట్టించే మాట. చాలా మంది నాయకులు చంద్రబాబుని విమర్శించారు. పార్టీ బయటకు పోయారు. కానీ వారు పార్టీ లేదు బొక్కా లేదూ అంటూ ఇంత హార్ష్ గా అనలేదు అని అంటున్నారు. అయితే అది ఫేక్ వీడియో తాను అలా అనలేదని అప్పట్లో అచ్చెన్న వివరణ ఇచ్చినా కూడా టీడీపీ పెద్దలు మాత్రం దాని మీద మనసులో గుస్సా అలాగే ఉంచుకున్నారు అంటున్నారు.
అందుకే అచ్చెన్నతో ఆ దూరం మెయింటెయిన్ చేస్తున్నారు అంటున్నారు. నిజానికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఈ కీలక సమయాన అచ్చెన్న తన మాటల ధాటితో ఒక ఊపు ఊపేయాలి. అయితే అచ్చెన్నను మాత్రం సైడ్ చేసినట్లుగా ఉంది అంటున్నారు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు కూడా ఆయన్ని ఆహ్వానించినా మునుపటి తీరు అయితే అటూ ఇటూ లేదనే ప్రచారం సాగుతోంది.
ఇదంతా అచ్చెన్న నోటి దురుసుతో చేసుకున్నదే అని కూడా అంటున్నారు. పార్టీ లేదూ బొక్కా లేదు అన్న మాట మాత్రమే కాదు, లోకేష్ తీరు మీద నాడు అచ్చెన్న కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అవే ఇపుడు ఆయన కాళ్ళకు బ్రేకులు వేస్తున్నాయి అని అంటున్నాయి. ఇవన్నీ చూసుకున్నపుడు బీసీ కార్డు ఉత్తరాంధ్రా నాయకుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయని అంచనా వేసి చంద్రబాబు ఆయనకు ఇచ్చిన పదవి వల్ల అటు పార్టీకి కానీ ఇటు అచ్చెన్నకు కానీ ఏ మాత్రం ఉపయోగపడలేదని అంటున్నారు.
ఇక లేటెస్ట్ గా ఏపీలో ఏ ఆందోళన జరిగినా కూడా అచ్చెన్నాయుడు లేకుండానే టీడీపీ కధ సాగుతోంది అంటున్నారు. ఈ మధ్య మంత్రి కొడాలి నాని మీద గుడివాడలో క్యాసినో గేమ్స్ ఆడించారు అని టీడీపీ గట్టిగానే ఆరోపణలు చేసింది. నిజ నిర్ధారణ కమిటీని కూడా పంపించింది. అక్కడ కూడా అచ్చెన్న హడావుడి అయితే లేదు, ఇక ఏపీలో పలు నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే వాటి విషయంలో కూడా అచ్చెన్న సలహాలు ఏవీ లేవని అంటున్నారు. ఒక విధంగా అచ్చెన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటే ఉన్నారు అన్నట్లుగానే సీన్ సాగుతోంది అంటున్నారు.
మరో వైపు చూస్తే అధినాయకత్వం అచ్చెన్నకు తగ్గిస్తున్న ప్రాధాన్యతను చూసిన తమ్ముళ్ళు కూడా ఆలోచనలో పడుతున్నారని టాక్. అచ్చెన్నకు ఫోన్ చేసి మాట్లాడేందుకు కూడా కొందరు వెనకా ముందూ అవుతున్నారుట. ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. అచ్చెన్నతో సన్నిహితంగా ఉంటే తమకు ఎక్కడ ప్రాధాన్యత తగ్గిస్తారో అన్న జడుపు కూడా తమ్ముళ్లకు ఉంది అని చెబుతున్నారు. మొత్తానికి అచ్చెన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా దివ్యంగా వెలిగిపోతారు అనుకుంటే పదమూడు జిల్లాలలో మూడింట కూడా ఆయన పర్యటించలేని పరిస్థితిలో ఉన్నారని చెబుతున్నారు. ఇంతకీ పార్టీలో అచ్చెన్నకు అచ్చే దిన్ వచ్చేనా... చూడాలి మరి అన్నది అనుచరుల మాట.