Begin typing your search above and press return to search.

అచ్చెన్న, లోకేష్: వీడియోకు ముందు.. తర్వాత

By:  Tupaki Desk   |   14 April 2021 2:30 PM GMT
అచ్చెన్న, లోకేష్: వీడియోకు ముందు.. తర్వాత
X
నిన్న లీక్ అయిన ఆ ఒక్క వీడియో టీడీపీలో కలకలం రేపుతోందట. ఎందుకంటే ఏపీ టీడీపీ అధ్యక్షుడే తమ భావి వారసుడు లోకేష్ గురించి చెప్పిన నిజాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయని అంటున్నారు. దీంతో వీడియోకు ముందు అనోన్యంగా ఉన్న అచ్చెన్నాయుడు, నారా లోకేష్ బంధం.. ఈ వీడియో రిలీజ్ తర్వాత ఎలా మారుతుంది? మారిందన్న అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి.

ఈ క్రమంలోనే బుధవారం అలిపిరి వద్ద ఆ సందర్భం రానే వచ్చింది. నారా లోకేస్ వైఎస్ వివేకా హత్యతో తనకు కానీ.. తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు. ఇదే క్రమంలోనే సీఎం జగన్ కూడా తనలాగా ఇక్కడికి తిరుమలేషుడి పాదల చెంతకు వచ్చి ప్రమాణం చేయాలని నారా లోకేష్ సవాల్ చేశారు.

ఇక్కడే అరుదైన సందర్భం ఆవిష్కృతమైంది. నిన్న వీడియోలో అచ్చెన్నాయుడు ఏకంగా లోకేష్ కామెంట్లు చేసినట్టు ప్రచారం అయ్యింది. ఈ అలిపిరిలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆ వ్యాఖ్యలు సారాంశాన్ని వదిలేసి ఇద్దరూ అన్యోన్యతతో తిరగడం చూసి టీడీపీ నేతలు, కార్యకర్తల కళ్లు చల్లబడ్డాయి. వాళ్లద్దరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అచ్చెన్నాయుడిని నారా లోకేష్ తన పక్కనే కూర్చొబెట్టుకోవడం.. ఇద్దరూ కలిసి పోరాటం చేయడం.. గుసగుసలాడుకోవడం చూసి వీడియోలోని కథనంతా వీరిద్దరూ మరిచిపోయి శ్రేణులకు మంచి మెసేజ్ ఇచ్చారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. లోపల ఎంతున్నా పైకి మాత్రం వీరి చూపిన ప్రేమానుభావాలపై ఇప్పుడు అందరూ తలోరకంగా కామెంట్ చేస్తున్నారు.