Begin typing your search above and press return to search.

గుసగుస: అచ్చెన్న.. చంద్రబాబును ఎందుకు పొగుడుతున్నట్టు?

By:  Tupaki Desk   |   21 April 2021 8:30 AM GMT
గుసగుస: అచ్చెన్న.. చంద్రబాబును ఎందుకు పొగుడుతున్నట్టు?
X
మొన్నటికి మొన్న తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బయటపడిన ‘అచ్చెన్నాయుడు’ వీడియో టీడీపీలోని లూప్ హోల్స్ ను బయటపెట్టిందని ప్రచారం సాగింది. ‘నారా లోకేష్’ ఉంటే టీడీపీకి భవిష్యత్ లేదన్నట్టుగా అచ్చెన్న మాట్లాడినట్టున్న ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో అచ్చెన్న ఇరుకునపడ్డారన్న చర్చ సాగుతోంది.

ఏమైందో తెలియదు కానీ.. దీనిపై చంద్రబాబు, నారా లోకేష్ లు నోరు మెదపలేదు. అయితే తాజాగా చంద్రబాబును ఆకాశానికెత్తేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 40 ఇయర్స్ పాలిటిక్స్ అయిన చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఇక అంతటితో ఆగకుండా దేశానికి ఎంతో మంది ప్రధానులు, రాష్ట్రపతులను చంద్రబాబు అందించారని అచ్చెన్న ఊదరగొట్టేశారు.

ఇక చంద్రబాబును మళ్లీ సీఎంగా చూసే వరకు విశ్రమించవద్దని క్యాడర్ కు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా దిశానిర్ధేశం చేశారు.

అయితే సడెన్ గా చంద్రబాబుపై అచ్చెన్నకు అంత ప్రేమ ఎందుకొచ్చింది.. ఈ భీషణ ప్రతిజ్ఞలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తిరుపతి వీడియో బయటకు వచ్చాక కక్కలేక మింగలేక ఇలా చంద్రబాబును పొగడ్తలతో కూల్ చేద్దామని అచ్చెన్నాయుడు ఈ స్కెచ్ గీశారా? అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.