Begin typing your search above and press return to search.

మార్షల్స్ చంద్రబాబు తోసేయడం బాధాకరం ..!

By:  Tupaki Desk   |   12 Dec 2019 6:44 AM GMT
మార్షల్స్ చంద్రబాబు తోసేయడం బాధాకరం ..!
X
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ లో టీడీపీ సభ్యులు ఆందోళన కు దిగారు. అధికార సభ్యులు ప్రసంగిస్తున్న సమయంలో..టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. కావాలనే గిల్లి కజ్జాలు పెట్టుకుని సభలో గందళగోళం సృష్టించాలని చూస్తున్నారని అంబటి ఆరోపించారు. వారికి ఉన్న బాధ ఏంటో సభాపతికి చెప్పుకోవాలని, అలా చెయ్యకుండా పోడియం వద్దకు వెళ్లి అరవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

టీడీపీ సభ్యులు ముందస్తు గా ప్లాన్ చేస్కోని గొడవ చెయ్యాలని చూస్తూన్నారని, రెండు రోజుల నుంచి వారి ధోరణి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..ప్రభుత్వం 2430 జీవోతో మీడియా పై ఆంక్షలు విధిస్తుందని పేర్కొన్నారు. శాసనసభ లో అన్ని ఛానల్స్‌ కి అవకాశం ఇచ్చి, 3 ఛానల్స్‌ను నిషేదం ఇచ్చినందువల్ల తాము నిరసన వ్యక్తం చెయ్యాలనుకున్నామని అన్నారు.

ప్లకార్డ్స్, బ్యానర్, నల్ల బ్యాడ్జీల తో వస్తుంటే, గేటు దగ్గర మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. థియో పిల్లస్ అనే కొత్త ఛీప్ మార్షల్ వచ్చారని, ఆయన వైసీపీ నేతల బంధువో, పార్టీ కార్యకర్తో తెలియడం లేదని, ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా ఛీప్ మార్షల్ చెయ్యి పట్టుకుని తోసేసారని, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులు అని కూడా చూడకుండా వ్యవహరించారని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.కాగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యల ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన ఖండించారు.